ఒక్కొక్కరికి 168జీబి డాటా, వివో ఫోన్‌ల పై జియో సంచలనం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2017కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న చైనా స్మార్ట్ ఫోన్ ల తయారీ కంపెనీ వివోతో, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకుంది.

Read More : నోకియా స్మార్ట్‌ఫోన్‌లలో మూడు కీలక మార్పులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘Vivo Jio Cricket Mania

ఈ ఒప్పందంలో భాగంగా ‘Vivo Jio Cricket Mania' పేరుతో ప్రత్యేకమైన ఆఫర్ ను ఇరు సంస్థలు అనౌన్స్ చేసాయి. ఈ కొత్త ఆఫర్ లో భాగంగా మే 10, 2017లోపు వివో స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేసిన యూజర్లకు 168జీబి 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది.

VJTeam Code

ఈ ఆఫర్ కేవలం వివో స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. వివో హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసిన యూజర్ తాను సపోర్ట్ చేస్తున్న ఐపీఎల్ టీమ్ పేరును VJTeam Code రూపంలో 59009కు ఎస్ఎంఎస్ చేయవల్సి ఉంటుంది. టీమ్ కోడ్స్ తాలుకా ఇమేజ్‌ను పైన చూడొచ్చు.

59009కు ఎస్ఎంఎస్ చేయటం ద్వారా..

59009కు మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ పేరును కీవర్డ్స్ రూపంలో సెండ్ చేసినట్లయితే విజయవంతంగా మీరు స్కీమ్‌లోకి ఎంటర్ అవుతారు.

మీ టీమ్ ఐపీఎల్ 10 విజేతగా నిలిచినట్లయితే...

మీరు ఎంచుకున్న ఐపీఎల్ టీమ్ గెలుపొందే ప్రతి మ్యాచ్‌కు 3జీబి డేటా మీకు లభిస్తుంది, ఒక వేళ ఓడిపోయినట్లయితే 1జీబి డేటా మీకు లభిస్తుంది. ఒక వేళ మ్యాచ్ డ్రాగా గిసినట్లయితే 2జీబి డేటా లభిస్తుంది. మీరు ఎంచుకున్న టీమ్ క్వాలిఫైర్‌కు రీచ్ అయినట్లయితే మీ డేటా మల్టిపుల్ అవుతుంది, ఒకవేళ ఫైనల్‌కు రీచ్ అయినట్లయితే మీ డేటా ట్రిపుల్ అవుతుంది. మీ టీమ్ ఐపీఎల్ 10 విజేతగా నిలిచినట్లయితే 168జీబి డేటా మీకు లభిస్తుంది. అంటే నాలుగు రెట్లు ఎక్కువన్నమాట. ఫైనల్ ముగిసిన వెంటనే ఉచిత డేటా యూజర్ అకౌంట్‌లో యాడ్ అవుతుంది.

ఏప్రిల్ 30, 2017లోగా..

ఏప్రిల్ 5, 2017న ప్రారంభమైన వివో జియో క్రికెట్ మేనియా రిజిస్ట్రేషన్స్ మే 10, 2017తో ముగుస్తాయి. జియో యూజర్లు ఏప్రిల్ 30, 2017లోగా ఈ స్కీమ్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే ఆఫర్ తాలుకా పూర్తి 4జీ డేటా బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Partners With Vivo to Offer Up to 168GB of Free Data. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot