రూ.1000 దగ్గర పెట్టుకోండి, జియో ఫోన్లు రేపు వస్తున్నాయ్..

రిలయన్స్‌ జియో 4జీ ఫీచర్‌ ఫోన్ల డెలివరీని ఆదివారం నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.

By Hazarath
|

రిలయన్స్‌ జియో 4జీ ఫీచర్‌ ఫోన్ల డెలివరీని ఆదివారం నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. సంస్థ దాదాపు 60 లక్షల ఫోన్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపింది. 15 రోజుల్లో వీటి పంపిణీ పూర్తవుతుందని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు చెందిన చానల్‌ పార్ట్‌నర్‌ ఒకరు ఈ విషయాన్ని పీటీఐ వార్త సంస్థకు తెలిపారు. జియో ఫోన్ల ప్రి-బుకింగ్‌ ఆగస్ట్‌ 24న ప్రారంభమైన విషయం తెలిసిందే.

జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ : ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు !జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ : ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు !

రూ.500 ప్రారంభ డిపాజిట్‌తో

రూ.500 ప్రారంభ డిపాజిట్‌తో

యూజర్లు రూ.500 ప్రారంభ డిపాజిట్‌తో కస్టమర్లు వీటికి బుకింగ్‌ చేసుకున్నారు. మిగిలిన మొత్తమైన రూ. 1000 ఫోన్ల డెలివరీ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.

మూడేళ్ల తర్వాత

మూడేళ్ల తర్వాత

వినియోగదారులు మూడేళ్ల తర్వాత ఫోన్‌ను వెనక్కు ఇవ్వడం ద్వారా ఈ పూర్తి మొత్తాన్ని తిరిగి పొందొచ్చు.

మూడు సంవత్సరాల కంటే ముందే చెల్లించేందుకు

మూడు సంవత్సరాల కంటే ముందే చెల్లించేందుకు

ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో 4 జీ పీచర్‌ ఫోన్‌ కొనుగోలు సందర్భంగా కస్టమర్లు చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్‌ మూడు సంవత్సరాల కంటే ముందే చెల్లించేందుకు రిలయన్స్ జియో యోచిస్తోందని తెలుస్తోంది.

 కేవలం 153 రీ ఛార్జ్ మీదనే

కేవలం 153 రీ ఛార్జ్ మీదనే

కొన్ని రిపోర్టుల ప్రకాం ఈ ఫోన్ కేవలం 153 రీ ఛార్జ్ మీదనే నడుస్తుంది. మిగతా రీఛార్జ్‌లు దీనికి పనిచేయవని తెలుస్తోంది. రూ. 153 ప్లాన్‌తో మీకు అన్‌లిమిటెడ్ కాల్స్, అలాగే ఎసెమ్మెస్‌లు, 500 ఎంబి డేటా లభిస్తుంది. డేటా అధికంగా వాడేవారికి ఇది నిరాశే.

తొలుత గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు

తొలుత గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు

తొలుత గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, ఆ తర్వాత పెద్ద నగరాలకు వీటిని పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ‘గ్రామీణ, పట్టణాల మధ్య డిజిటల్‌ వారధిగా జియో ఫోను నిలవాలని ఛైర్మన్‌ (ముకేశ్‌ అంబానీ) చెప్పారు.

రిలయన్స్‌ జియోను సంప్రదించగా

రిలయన్స్‌ జియోను సంప్రదించగా

అందుకే ఆదివారం నుంచి గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచి వీటిని పంపిణీ చేస్తామని తెలిపారు. అయితే ఈ విషయంపై రిలయన్స్‌ జియోను సంప్రదించగా.. ఎలాంటి స్పందన రాలేదు.

 మళ్లీ ఎప్పుడు బుకింగ్స్‌ ప్రా రంభించే విషయాన్ని

మళ్లీ ఎప్పుడు బుకింగ్స్‌ ప్రా రంభించే విషయాన్ని

మొదటి దశలో భాగంగా 60 లక్షల ఫోన్లను జియో సరఫరా చేస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు 60 లక్షల ఫోన్ల బుకింగ్స్‌ జరగడంతో వీటి బుకింగ్స్‌ను జియో నిలిపివేసింది. మళ్లీ ఎప్పుడు బుకింగ్స్‌ ప్రా రంభించే విషయాన్ని రిలయన్స్‌ జియో ప్రకటించలేదు.

Best Mobiles in India

English summary
Reliance Jio Phone delivery may start from Navaratri, bookings will start soon Read more at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X