రూ.999కే Jio 4G VoLTE ఫోన్!

కనివినీ ఎరగని ఉచిత ఆఫర్లతో ఇండియన్ టెలికామ్ సెక్టార్‌లోకి పెను ఉప్పెనలా దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఇటు ఫీచర్ ఫోన్ మార్కెట్‌ను కూడా కీలకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫీచర్ ఫోన్ మార్కెట్లో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతూ రూ.990 నుంచి రూ.1500 రేంజ్‌లో 4G VoLTE ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం.

Read More : రూ.1,999కే Lenovo P2 స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

త్వరలోనే మార్కెట్లోకి..

ఇండియన్ మొబైల్ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా భావిస్తోన్న ఈ చౌక ధర 4జీ వోల్ట్ ఫోన్‌లు త్వరలోనే మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశముందని సమాచారం.

వాయిస్ కాల్స్, ఇంటర్నెట్, వీడియో స్ట్రీమింగ్

రూ.346తో సంవత్సరమంతా ఐడియా 4జీ

జియో కారుచౌక 4జీ ఫీచర్ ఫోన్‌లలో VoLTE ఫీచర్‌తో పాటు ముందు వెనకా కెమెరాలను కలిగి ఉండే ఈ ఫోన్‌లు ఉచిత్ కాల్స్‌ను ఆఫర్ చేయటంతో పాటు MyJio యాప్ సూట్‌లోని లైవ్ టీవీ, జియో చాట్, జియో వాలెట్,వీడియో ఆన్ డిమాండ్ వంటి యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తాయని తెలుస్తోంది.

క్వాల్కమ్, మీడియాటెక్‌లతో సంప్రదింపులు

రిలయన్జ్ జియో ఫీచర్ ఫోన్‌లకు సంబంధించి చిప్‌సెట్‌ల కోసం క్వాల్కమ్ అలానే మీడియాటెక్ సంస్ధలతో రిలయన్స్ జియో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరో రిపోర్ట్ ప్రకారం చైనాకు చెందిన Spreadtrum జియో ఫీచర్ ఫోన్‌లకు చిప్‌సెట్‌లను సమకూర్చనున్నట్లు తెలియవచ్చింది.

Spreadtrum 9820 processorతో

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై సంక్రాంతి డిస్కౌంట్‌లు

రిలయన్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్న VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు Spreadtrum 9820 processorతో పని చేస్తాయని మరో రూమర్ చెబుతోంది. ఈ ప్రాసెసర్ VoLTE సాఫ్ట్‌వేర్‌ను సమర్థవంతంగా సపోర్ట్ చేస్తుందట.

ఇక 2జీ మార్కెట్ ఉండకపోవచ్చు..

రిలయన్స్ VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చినట్లయితే, ప్రస్తుతం 2జీ నెట్‌వర్క్‌తో సరిపెట్టుకుంటున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలు పూర్తిగా జియో 4జీ వైపు మారిపోయే అవకాశం ఉంది.

జియో కారుచౌక 4జీ ఫీచర్ ఫోన్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలంటే..?

Paytmలో కొత్త యాడ్ అయిన 5 ఫీచర్లు

రిలయన్స్ జియో ఆఫర్ చేయబోయే చౌకబారు లైఫ్ ఈజీ 4జీ ఫోన్ కోసం మీరు ఎదురుచూస్తున్నట్లయితే,మరికొద్ది రోజులు వేచి చూడక తప్పుదు. ఫోన్ మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే బుక్ చేసుకునేందుకు జియో అపీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌తో

జియో వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తరువాత LYF Easy ఫోన్ బుకింగ్ పేజీ మీకు కనిపిస్తుంది అక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి "Buy" ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. ఈ మార్గాల ద్వారా జియో ఫోన్‌‌లను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

మీ ఆర్డర్ విజయవంతమైన వెంటనే

రూ.11కే రోజంతా 4జీ ఇంటర్నెట్

మీ ఆర్డర్ విజయవంతమైన వెంటనే జియో కస్టమర్ కేర్ నుంచి మీరిచ్చిన మొబైల్ నెంబర్‌కు మెసేజ్ అందుతుంది. ఫోన్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత మాత్రమే ఈ ప్రాసెస్‌ను అనుసరించండి. లైఫ్ ఈజీ ఫోన్‌లను జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఈ-కామర్స్ సైట్‌లలో కూడా అందుబాటులో ఉంచే అవకాశముందని సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio's 4G VoLTE feature phones priced under Rs. 1,500 to be launched soon. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot