జియో ఫీచర్ ఫోన్‌తో ఆదాయం ఎలా వస్తుందంటే..

Written By:

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చౌక 4జీ హ్యాండ్‌సెట్‌ ఆఫర్‌ వల్ల పరిశ్రమలో ఆదాయాల తగ్గుదలకు అడ్డుకట్ట పడుతుందని ఫిచ్‌ తెలిపింది. కంపెనీకి మరో 10 కోట్ల మంది వినియోగదార్లు జతచేరుతాయని.. తద్వారా ఆదాయం విషయంలో 2018 కల్లా మార్కెట్‌ వాటా 10శాతానికి చేరుతుందని ఫిచ్‌ వివరించింది. ఫిచ్‌ ఇంకా తన నివేదికలో ఇంకా ఏం వెల్లడించిందంటే..

ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ల హోరు, రూ. 10 వేలకే ల్యాపీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్‌ వాడకం

సెప్టెంబరు నుంచి రాబోతున్న జియోఫోన్ల వల్ల ఇంటర్నెట్‌ వాడకం వేగవంతం అయ్యే అవకాశం ఉందని. దీని వల్ల టెలికాం కంపెనీల ఆదాయాల క్షీణతకు అడ్డుకట్ట పడుతుందని చెబుతోంది.

కనీసం 10 కోట్ల మంది వినియోగదారులు చేరినా

కనీసం 10 కోట్ల మంది వినియోగదారులు చేరినా.. వార్షిక పరిశ్రమ ఆదాయానికి ఈ హ్యాండ్‌సెట్ల వల్ల అదనంగా 3-4 శాతం (దాదాపు 950 మిలియన్‌ డాలర్లు) ఆదాయం సమకూరుతుంది.

4జీ ఫోన్‌ వాడే వారి సంఖ్య

జియోఫోన్‌ రాకతో తొలిసారిగా 4జీ ఫోన్‌ వాడే వారి సంఖ్య పెరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో 2జీ ఫోన్ల స్థానంలో చాలా వేగంగా 4జీ హ్యాండ్‌సెట్లు కనిపిస్తాయని ఫిచ్ తెలిపింది.

అధిక డేటా రేట్లు

అధిక డేటా రేట్లు, గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ లేకపోవడం వల్ల ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ ఇంటర్నెట్‌ వ్యాప్తి తక్కువగా ఉంది.

 

 

రూ.153 టారిఫ్‌ అనేది

అంబాని ప్రకటించిన రూ.153 టారిఫ్‌ అనేది గ్రామీణ వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయం కంటే 50 శాతం ఎక్కువే. ఇది పరిశ్రమ ఆదాయానికి మద్దతునిస్తుంది.

ఇతర కంపెనీలు సైతం

వినియోగదార్ల సంఖ్యను పెంచుకోవడం కోసం వచ్చే రెండేళ్లలో జియో మరిన్ని ఆఫర్లతో ముందుకురావొచ్చు. అపుడు ఇతర కంపెనీలు సైతం ధరల కోత, డిస్కౌంట్లు ఇతరత్రా ఆఫర్లను ప్రకటించాల్సి రావొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio's cheap handsets may reverse industry's revenue decline trend, says Fitch report Read more at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot