రిలయన్స్ జియో రూ.500 ఫోన్, 7 ఆసక్తికర విషయాలు

2జీ నెట్‌వర్క్ యూజర్లే లక్ష్యంగా రాబోతోన్న ఈ 4G VoLTE ఫోన్‌ను జియో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

|

రిలయన్స్ జియో నుంచి ఓ కారుచౌక ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి రాబోతున్నట్లు సమాచారం. 2జీ నెట్‌వర్క్ యూజర్లే లక్ష్యంగా రాబోతోన్న ఈ 4G VoLTE ఫోన్ ధర రూ.500లోపే ఉండొచ్చని వార్తలు గుప్పుమంటున్నాయి. రిలయన్స్ జియో రూ.500 ఫోన్‌కు సంబంధించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న పలు ఆసక్తికర అంశాలు...

ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం...

ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం...

రిలయన్స్ జియో తన రూ.500 4G VoLTE ఫోన్‌ను జూలై 21న ముంబైలో జరగబోయే రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో అనౌన్స్ చేసే అవకాశముంది.

Spreadtrum ప్రాసెసర్‌

Spreadtrum ప్రాసెసర్‌

జియో అందించబోయే 4G VoLTE ఫీచర్ ఫోన్‌లకు చైనాకు చెందిన Spreadtrum Communications ప్రాసెసర్‌లను సమకూర్చనున్నట్లు సమాచారం.

HSBC note ప్రకారం..

HSBC note ప్రకారం..

రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ ధర రూ.500 (8 డాలర్ల)లోపు ఉండనుంది. మరికొన్ని రిపోర్ట్స్ ప్రకారం జియో 4జీ ఫీచర్ ఫోన్ రూ.1000 ఉండొచ్చని తెలుస్తోంది.

ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం...

ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం...

జూలై చివరా లేదా ఆగష్టు మొదటి వారం నాటికి ఈ ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చి చేరతాయి. ఆగష్టు 15 నుంచి సేల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రూ.80, రూ.90 రేంజ్‌లో కొత్త టారిఫ్ ప్లాన్స్..

రూ.80, రూ.90 రేంజ్‌లో కొత్త టారిఫ్ ప్లాన్స్..

జియో ధన్ దనా ధన్ ఆఫర్ ముగింపుకు చేరుకున్న నేపథ్యంలో జూలై 21న ముంబైలో జరగబోయే రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో కొత్త ప్లాన్‌లను జియో అనౌన్స్ చేయనుందని సమాచరం. 4G VoLTE ఫీచర్ ఫోన్‌లతో పాటు రూ.80, రూ.90 రేంజ్‌లో కొత్త టారిఫ్ ప్లాన్‌లను కూడా జియో అనౌన్స్ చేసే అవకాశముందని మర్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

జియో యూజర్లు 112.55 మిలియన్లు

జియో యూజర్లు 112.55 మిలియన్లు

కంపెనీ లెక్కల ప్రకారం ఏప్రిల్ 2017 నాటికి జియో నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోన్న వారి సంఖ్య 112.55 మిలియన్లుగా ఉంది. రూ.500 ఫోన్ ను అందుబాటులోకి తీసుకురావటంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.

Best Mobiles in India

English summary
Reliance Jio set to announce Rs 500 phone: Things to know. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X