జియోఫోన్‌లో గేమ్స్ వస్తున్నాయ్, ఓ లుక్కేసుకోండి
దేశీయ టెలికాం మార్కెట్లో సంచలనం రేపిన రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ మార్కెట్లోనూ దుమ్మురేపుతోంది.
దేశీయ టెలికాం మార్కెట్లో సంచలనం రేపిన రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ మార్కెట్లోనూ దుమ్మురేపుతోంది. జియోఫోన్, జియోఫోన్ 2తో దేశీయ మొబైల్ మార్కెట్లో కోట్ల అమ్మకాలను కొల్లగొట్టింది. అత్యంత తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లకు ధీటైన ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు మరో సంచలన ఫీచర్ జియో ఫోన్లోకి రానుంది. జియో ఫోన్ యూజర్ల కోసం HTML5 games contentను జియో స్టోర్లో రిలయన్స్ కంపెనీ ప్రవేశపెట్టనుంది. దీని మీద ఇప్పటికే కసరత్తులు కూడా చేస్తోంది. ఈ అంశం మీద పూర్తి వివరాల్లోకెళితే..

HTML5 games
అనేకమంది మొబైల్ స్ట్రీమ్ డెవలపర్స్ హైక్వాలిటీ HTML5 gamesను జియో ఫీచర్ ఫోన్లో అందించేందుకు లోపల పనిచేస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితమే జియో తన ఫీచర్ ఫోన్లలో గేమ్స్ ని లాంచ్ చేసిన సంగతి విదితమే.

టైటిల్స్
జియో గేమ్ స్టోర్ లో మొబైల్ స్ట్రీమ్ టాప్ సెల్లర్ గేమ్స్ అయిన ColorPin, Get10 and Neon Biker లాంటి గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సంధర్భంగా మొబైల్ స్ట్రీమ్ సీఈఓ మాట్లాడుతూ జియోతో మా ప్రయాణం ఆనందాన్ని ఇస్తుందని, ఈ ప్రయాణం ఇండియాలో మా వ్యాపార వృద్ధికి మరింతగా సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2019 టార్గెట్
ఈ నేపథ్యంలో 2019లో మొబైల్ స్ట్రీమ్ నుండి ఇండియాకు ఇతర రకాల ఉత్పత్తులు కూడా వస్తాయని తెలిపారు. జియోతో టైఅప్ అయి ఈ ఏడాది కొన్ని సంచలనాలు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

మొబైల్ స్ట్రీమ్
ఈ గేమ్స్ అన్నీ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ ద్వారా మానిటైజ్ అవుతాయని తెలిపారు. ఈ సర్వీసులను గతేడాది లాంచ్ చేశారు. 200 మిల్లియన్ యాడ్స్ ఈ మూడు టైటిల్స్ లో భాగస్వామ్యంగా ఉన్నాయి. జనవరిలో మరో మూడు టైటిల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








