JioPhone బుకింగ్స్.. మీరు తెలసుకోవల్సిన ముఖ్యమైన విషయాలు
టర్మ్స్ అండ్ కండీషన్స్...
జియోఫోన్ ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్‌ను ప్రతి ఒక్కరు రూ.500 అడ్వాన్స్‌గా చెల్లించి ఆర్డర్ చేయవచ్చు. అయితే, ఈ ఫోన్‌ను బుక్ చేసుకునే ముందు తెలుసుకోవల్సిన ముఖ్యమైన 'టర్మ్స్ అండ్ కండీషన్స్'...

ఫోన్ డెలివరీ అయిన తరువాత మిగలిన రూ.1000
జియోఫోన్ కొనుగోలుదారులు ఫోన్ ప్రీ-బుకింగ్ సమయంలో రూ.500 అడ్వాన్స్ క్రింద చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ డెలివరీ అయిన తరువాత మిగలిన రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ను 36 నెలలు తరువాత మీరు ఫోన్ వద్దనుకుంటే వాపసు ఇచ్చేస్తారు.

ప్రతి 90రోజులకు ఒకసారైనా..
రూ.1500 రీఫండ్ అమౌంట్ మీకు లభించాలంటే మీమీ జియోఫోన్‌లను ప్రతి 90రోజులకు ఒకసారైనా రూ.153 ప్యాక్‌తో రీఛార్జ్ చేయవల్సి ఉంటుంది.

First-come- First-serve..
First-come- First-serve పద్ధతిలో జియోఫోన్‌లను ముందుగా బుక్ చేసుకున్న ముందుగా డెలివరీ ఉంటుంది. జియోఫోన్ డెలివరీ ప్రాసెస్ సెప్టంబర్ 1వ తేదీ నుంచి సెప్టంబ 4 మధ్య ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రూ.153, రూ.23, రూ.53
జియోఫోన్ యూజర్లకు రూ.153 మంత్లీ ప్యాక్‌తో పాటు రూ.23, రూ.53 సాచెట్ ప్యాక్స్ అందుబాటులో ఉంటాయి. రూ.153 ప్యాక్‌ను పొందటం ద్వారా నెల మొత్తం అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 500 ఎంబి డేటా అందుబాటులో ఉంటుంది. రూ.24 ప్యాక్ రెండు రోజుల వ్యాలిడిటీతో, రూ.54 ప్యాక్ 7 రోజుల వ్యాలిడిటీతో లభిస్తాయి.

జియోఫోన్‌తో జియోఫోన్ టీవీ కేబుల్ ఉచితం
జియోఫోన్‌తో పాటు జియోఫోన్ టీవీ కేబుల్ కూడా ఉచితంగా లభిస్తుంది. కాబట్టి, ఈ యాక్సెసరీని కొనుగోలు చేయవల్సిన అవసరం ఉండదు. ఈ కేబల్ ద్వారా జియోఫోన్‌ను టీవీకి కనెక్ట్ చేసుకుని ఫోన్ కంటెంట్‌ను టీవీలో స్ర్కీన్‌లో స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ ప్యాక్ ఖరీదు రూ.309.

ప్రస్తుతానికి సింగిల్ సిమ్ వేరియంట్‌లో మాత్రమే
జియోఫోన్ ప్రస్తుతానికి సింగిల్ సిమ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలో డ్యుయల్ సిమ్ వేరియంట్ ను అందుబాటులోకి తీసుకువస్తారు.


Click it and Unblock the Notifications








