Home
Mobile

చేతికందిన జియో ఫోన్, యూజర్లను సంతృప్తిపరిచిందా...?

జియో ఫోన్ చేతికొచ్చింది ఇప్పుడు. మరి యూజర్లని ఈ ఫోన్ సంతృప్తిరిచిందా.. ఓ లుక్కేయండి.

By Hazarath

జియో.. జియో.. దేశమంతా గత ఏడాది నుంచి ఈ పేరే కలవరిస్తోంది. ఉచిత ఆఫర్లతో దిగ్గజాలను కలవర పెట్టిన జియో ఫీచర్ ఫోన్‌తో యూజర్లను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా రూ. 1500కే ఫీచర్ ఫోన్ అంటూ దిగ్గజాలకు షాకిచ్చింది. ఈ ఫోన్ కోసం దాదాపు 6 మిలియన్ల మంది బుక్ చేసుకున్నారు. జియో ఫోన్ చేతికొచ్చింది ఇప్పుడు. మరి యూజర్లని ఈ ఫోన్ సంతృప్తిరిచిందా.. ఓ లుక్కేయండి.

ఎట్టకేలకు చేతికి

ఎట్టకేలకు చేతికి

జియో ఫోన్ ఎట్టకేలకు చేతికి వచ్చింది. డిజిటల్ ఇండియాలో భాగంగా 50 కోట్ల ఫోన్లను ఇండియన్లకు అందించాలనే లక్ష్యంగా జియో అధినేత ముకేష్ అంబాని ఈ ఫోన్‌ని లాంచ్ చేసిన విషయం విదితమే.

ఇతర స్మార్ట్‌ఫోన్లను టార్గెట్ చేస్తూ..

ఇతర స్మార్ట్‌ఫోన్లను టార్గెట్ చేస్తూ..

దేశ వ్యాప్తంగా యూజర్లు ఇంటర్నెట్ వాడటమే లక్ష్యంగా ఈ ఫోన్ దూసుకొచ్చింది. ఇతర స్మార్ట్‌ఫోన్లను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ ఫోన్ జియో లక్ష్యంగా దూసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్ఎఫ్‌సి పేమెంట్లను

ఎన్ఎఫ్‌సి పేమెంట్లను

జియో ఫీచర్ ఫోన్ ఎన్ఎఫ్‌సి పేమెంట్లను సపోర్ట్ చేస్తుంది. దేశం మొత్తం డిజిటల్ ట్రాన్సిక్షన్స్ వైపు పయనిస్తుండటంతో ఈ ఫోన్‌లో ఆ ఫీచర్‌ని పొందుపరిచారు. ఇతర స్మార్ట్‌ఫోన్లకు ధీటుగా ఈ ఫీచర్ ఉంది.

 టివికి సపోర్ట్ చేసేలా

టివికి సపోర్ట్ చేసేలా

ఈ బుడ్డ జియో ఫోన్ ఏకంగా టివికి సపోర్ట్ చేసేలా రూపొందించారు. జియో మీడియా కేబుల్ ద్వారా దీనిని టివికి అనుసంధాం చేయవచ్చు. జియో టివి యాప్ ఈ ఫోన్లో ఉంది. జియో ప్లాన్లు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు ఈ ఫీచర్ పొందవచ్చు.

రూ. 153 ప్లాన్ యాక్టివేట్

రూ. 153 ప్లాన్ యాక్టివేట్

అయితే ఈ ఫోన్లో మీరు రూ. 153 ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడే మీరు జియో కాల్స్‌ని డేటాను ఎంజాయ్ చేయగలరు. లేకుంటే 2 రోజుల ప్లాన్ రూ.23 కాని వారం రోజుల ప్లాన్ 53 కాని యాక్టివేట్ చేసుకోవాలి.

జియో సిమ్‌కి మాత్రమే సపోర్ట్

జియో సిమ్‌కి మాత్రమే సపోర్ట్

ఇది కేవలం జియో సిమ్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీరు వేరే సిమ్ వేయాలనుకుంటే అది సాధ్యపడదు. మీరు జియో సిమ్‌ని జియో స్టోర్ కెళ్లి e-KYC process ద్వారా యాక్టివేట్ చేసుకోవాలి. మైక్రో ఎస్డి సదుపాయం ఉంది. 128 జిబి వరకు విస్తరణ సామర్ధ్యం ఉంది.

 KaiOS ఆపరేటింగ్ సిస్టం

KaiOS ఆపరేటింగ్ సిస్టం

ఈ ఫోన్ KaiOS ఆపరేటింగ్ సిస్టంతో వచ్చింది. వాట్సప్ సపోర్ట్ ఉంది కాని వాడలేరు. డెవలపర్లు KaiOS-based వాట్సప్ వర్షన్‌ను డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్‌కు కూడా ఈ వర్షన్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ ఫీచర్‌ని ఎంజాయ్ చేయగలం.

50 కోట్ల మంది యూజర్లను

50 కోట్ల మంది యూజర్లను

వాట్సప్ ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురావడం చాలా తేలికైన పనే. లేకుంటే 50 కోట్ల మంది యూజర్లను వాట్సప్ పోగొట్టుకున్నట్లవుతుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి వాట్సప్ ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా అన్నది సస్పెన్స్.

వైఫై నెట్‌వర్క్‌కి సపోర్ట్

వైఫై నెట్‌వర్క్‌కి సపోర్ట్

ఈ ఫోన్ వైఫై నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తుంది. కాని Wi-Fi hotspot ఫీచర్ లేదు. ఇది కొంచెం నిరాశ కలిగించే అంశమే. జియోఫై ద్వారా మీరు వైఫైకి కనెక్ట్ అవ్వవచ్చు.

మల్టి మీడియాను ఈ ఫోన్ సపోర్ట్

మల్టి మీడియాను ఈ ఫోన్ సపోర్ట్

మల్టి మీడియాను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. TV, videos, music, FM Radio లాంటి ఫీచర్లను యూజర్లు ఎంజాయ్ చేయవచ్చు. యూ ట్యూబ్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు.

కెమెరా

కెమెరా

కెమెరా చాలా ఆసక్తిని కలిగిస్తోంది.VGA కెమెరాతో వీడియో కాల్స్ చేసుకునే సదుపాయాన్ని జియో కల్పిస్తోంది. 2 ఎంపీ వెనుక కెమెరాతో ఫోటోలు షూట్ చేయవచ్చు.

బ్రౌజింగ్ సదుపాయం

బ్రౌజింగ్ సదుపాయం

బ్రౌజింగ్ సదుపాయం కూడా కలదు. 22 భాషలతో పాటు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. టార్చ్ లైట్ ,3.5mm headphone jack, FM radio లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇంకో నిరాశకరమైన అంశం ఏంటంటే ఈ ఫోన్లో ఇయర్ ఫోన్స్ సదుపాయం లేదు.

డిస్ ప్లే ఫీచర్

డిస్ ప్లే ఫీచర్

జియో ఫీచర్ ఫోన్లో డిస్ ప్లే ఫీచర్ యూజర్లకు మంచి అనుభూతిని కలిగిస్తుందని, ఇది యూజర్లను సంతృప్తి పరుస్తుందని ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కూడా అంత సంతృప్తిగా లేదని తెలుస్తోంది.

మలి విడత ఫోన్ల బుకింగ్

మలి విడత ఫోన్ల బుకింగ్

మరి యూజర్లను ఈ ఫోన్ ఏ మేరకు ఆకర్షిస్తుందనేది ముందు ముందు చూడాలి. మలి విడత ఫోన్ల బుకింగ్ అతి త్వరలోనే స్టార్ట్ అవుతాయని కంపెనీ తెలిపింది. 

images source: news 18

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance JioPhone First Impressions Review: Tears of Joy Guaranteed more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X