రిలయన్స్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ ఫోన్
బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ, రిలయన్స్ సరికొత్త 4జీ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. LYF Wind 6 పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.7,090. వైట్, బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను రిలియన్స్ డిజిటల్ ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ విత్ VoLTE, 3జీ, వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపీఎస్), 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
Read More : రైల్ బడ్జెట్ 2016, టెక్నాలజీకి ప్రాధాన్యత ఎంత..?


Click it and Unblock the Notifications