జనవరిలోనే జియో రూ.1000 ఫోన్!

వరస ఆఫర్లతో టెలికం మార్కెట్‌ను ఊపేస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 'లైఫ్ ఈజీ' పేరుతో ఈ బ్రాండ్ లాంచ్ చేయబోతున్న కారుచౌక 4జీ ఫోన్‌లు జనవరి, 2017లో మార్కెట్లో తీసుకురాబోతున్నట్లు సమాచారం. అనేక గ్రౌండ్ లెవల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫోన్ ధర రూ. 1,000లోపే ఉండొచ్చని తెలుస్తోంది.

Read More : కొత్త ఫోన్‌లతో జాగ్రత్త.. ఓవర్ హీట్ అవుతున్నాయ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాణ్యమైన కెమెరా, వై-ఫై, హాట్ స్పాట్

VoLTE నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలిగే ఈ ఫోన్‌లు Spreadtrum 9820 ప్రాసెసర్‌తో వస్తాయని తెలుస్తోంది. నాణ్యమైన కెమెరాలతో పాటు బ్లుటూత్, వై-ఫై, హాట్ స్పాట్ వంటి ఫీచర్లను ఈ ఎంట్రీ లెవల్ 4జీ వోల్ట్ ఫోన్‌లు కలిగి ఉంటాయని సమాచారం.

ఉచిత కాల్స్ కూడా..

అందుతోన్న మరికొన్న రిపోర్ట్స్ ప్రకారం జియో తన ‘లైఫ్ ఈజీ' హ్యాండ్‌సెట్‌ల పై ఉచిత కాల్స్ కూడా ఆఫర్ చేసే అవకాశముందని సమాచారం. తన 4జీ వోల్ట్ నెట్‌వర్క్‌ను దేశంలోని మారుమూల పల్లెలకు సైతం విస్తరించే క్రమంలో జియో తన లైఫ్ ఈజీ ఫోన్‌లను రూ.1000 కంటే తక్కువ ధరకు విక్రయించినా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

న్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసలబాటు..

2017 ఆరంభంలో లాంచ్ అయ్యే ఈ ఫోన్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసలబాటు కూడా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లైఫ్ ఈజీ ఫోన్‌లను బుక్ చేసుకునేందుకు పలు సలువైన మార్గాలు.

జియో అపీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి

రిలయన్స్ జియో ఆఫర్ చేయబోయే చౌకబారు లైఫ్ ఈజీ 4జీ ఫోన్ కోసం మీరు ఎదురుచూస్తున్నట్లయితే, వచ్చే ఏడాది ఆరంభం వరకు వెయిట్ చేయండి. ఫోన్ మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే బుక్ చేసుకునేందుకు జియో అపీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

ఫోన్ బుకింగ్ పేజీ మీకు కనిపిస్తుంది

జియో వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తరువాత LYF Easy ఫోన్ బుకింగ్ పేజీ మీకు కనిపిస్తుంది అక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి "Buy" ఆప్షన్ పై క్లిక్ చేయండి.

క్యాష్ ఆన్ డెలివరీ

క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో జియో ఫోన్‌‌లను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ ఆర్డర్ విజయవంతమైన వెంటనే జియో కస్టమర్ కేర్ నుంచి మీరిచ్చిన మొబైల్ నెంబర్‌కు మెసేజ్ అందుతుంది.

ఫోన్ లాంచ్ అయిన తరువాత మాత్రమే..

LYF Easy ఫోన్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత మాత్రమే ఈ ప్రాసెస్‌ను అనుసరించండి. లైఫ్ ఈజీ ఫోన్‌లను జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఈ-కామర్స్ సైట్‌లలో కూడా అందుబాటులో ఉంచే అవకాశముందని సమాచారం.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance likely to launch Jio LYF Easy 4G phones for Rs 1,000 in January 2017. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot