రిలయన్స్ జియో నుంచి లాంచ్ కాబోతోన్న 4G VoLTE ఫీచర్ ఫోన్‌కు సంబంధించి అనేక రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఫోన్‌లకు సంబంధించి రిలయన్స్ ఇప్పటి వరకు ఏ విధమైన అఫీషియన్ న్యూస్‌ను అనౌన్స్ చేయలేదు.
LYF లోగోతో..
తాజాగా టెక్‌పీపీ అనే వెబ్‌సైట్ రిలయన్స్ 4G VoLTE ఫీచర్ ఫోన్‌లకు సంబంధించి లైవ్ పిక్షర్స్‌ను లీక్ చేసింది. LYF లోగోతో కనిపిస్తోన్న ఈ ఫీచర్ ఫోన్ 2.4 అంగుళాల కలర్ డిస్‌ప్లే, డ్యుయల్ లాంగ్వేజ్ కీప్యాడ్, నేవిగేషన్ బటన్లను కలిగి ఉంది. టార్చ్ లైట్‌ను ఆపరేట్ చేసేుకునేందుకు ప్రత్యేకమైన బటన్‌ను ఈ ఫోన్ కలిగి ఉండటం విశేషం.
LYF 4G VoLTE స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..
512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ సపోర్ట్ (అందలో ఒకటి నానో సిమ్ స్లాట్).
KAI OS పై రన్ అవుతుంది...
Firefox ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్ధి చేసిన KAI OS పై జియో 4జీ వోల్ట్ ఫీచర్ ఫోన్‌లు రన్ అవుతాయని తెలుస్తోంది. జియో టీవీ, జియో సినిమా వంటి జియో సూట్ యాప్స్ కూడా ఈ డివైస్ తో ఇన్‌బిల్ట్‌గా రానున్నట్లు సమచారం.
వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ప్రధాన హైలైట్
వీడియో కాలింగ్, జీపీఎస్, బ్లుటూత్ 4.1 వంటి కనెక్టువిటీ ఫీచర్స్‌ను ఈ ఫోన్‌లో చూడొచ్చు. జియో 4జీ వోల్ట్ ఫీచర్ ఫోన్‌లకు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ప్రధాన హైలైట్ కానుందట. ఇన్ని సౌకర్యాలతో వస్తోన్న జియో 4జీ వోల్ట్ ఫీచర్ ఫోన్ ధర మార్కెట్లో రూ.1500లోపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.