రిలయన్స్ భారీ డిస్కౌంట్లు: సగానికి పైగా తగ్గిన Lyf ఫోన్ల ధరలు
రిలయన్స్‌కు చెందిన ఎల్‌వైఎఫ్ ఫోన్ల ధరలు సగానికి పైగా తగ్గాయి.
రిలయన్స్‌కు చెందిన ఎల్‌వైఎఫ్ ఫోన్ల ధరలు సగానికి పైగా తగ్గాయి. లైఫ్ సి459 ధర రూ.4,699 ఉండగా, అదిప్పుడు కేవలం రూ.2,392 ధరకే లభిస్తున్నది. ఇక లైఫ్ సి451 రూ.4,999 ఉండగా ఇప్పుడా ఫోన్ రూ.2,692 ధరకే లభిస్తున్నది. ఇవి రెండూ జియో సిమ్ సపోర్ట్ తో పనిచేస్తాయి. మరి వీటి ఫీచర్లు, ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం.

లైఫ్ సి451 ఫీచర్లు
4.5 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ

లైఫ్ సి459 ఫీచర్లు
4.5 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ

Airtel 4G volte ఫోన్‌ను దృష్టిలో ఉంచుకుని
త్వరలో రానున్న Airtel 4G volte ఫోన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్లను రిలయన్స్ కంపెనీ తగ్గించిదనే టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. Airtel 4G volte ఫోన్ ఈ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ధర రూ. 2000 నుంచి రూ. 2500 మధ్యలో ఉండే అవకాశం ఉంది.

అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్‌తో కూడిన జియో ఆఫర్లను..
ఈ ఫోన్లతో పాటు అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్‌తో కూడిన జియో ఆఫర్లను కూడా అందించనున్నారు. దీనిని మీరు ctober 2 నుంచి October 22 వరకు online, offline స్టోర్లలో పొందవచ్చు.


Click it and Unblock the Notifications








