లైఫ్ ఎఫ్1ఎస్, తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు

రిలయన్స్ జియో నుంచి బ్యాక్ టు బ్యాక్ స్మార్ట్‌ఫోన్స్

|

రెడ్మీ నోట్ 3, లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌లను టార్గెట్ చేస్తూ రిలయన్స్ తన లైఫ్ సిరీస్ నుంచి Lyf F1s పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.9,599. ఈ ఫోన్ కొనుగోలు పై వర్తించే రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌లో భాగంగా మార్చి 2017 వరకు జియో సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చు. అదనంగా రూ.500 క్యాష్ బ్యాక్ ను కూడా ఈ ఫోన్ పై పొందే అవకాశాన్ని రిలయన్స్ కల్పిస్తోంది.

Read More : సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా?, ముందుగా ఇవి తెలుసుకోండి

లైఫ్ ఎఫ్1ఎస్

Lyf F1s స్పెసిఫికేషన్స్...

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 423 పీపీఐ, 2.5 కర్వుడ్ గ్లాస్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 చిప్‌సెట్ విత్ ఆక్టా కోర్ ప్రాసెసర్ (1.8GHz + 1.4GHz), అడ్రినో 510 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

Read More : 2016.. ఈ 10 ఫోన్‌లదే!

లైఫ్ ఎఫ్1ఎస్

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఆటో ఫోకస్, 8ఎక్స్ డిజిటల్ జూమ్, ఆటో ఫ్రేమ్ రేట్, రెడ్ ఐ రిడక్షన్, వీడియో HDR సపర్ట్, క్రోమా ఫ్లాష్, యుబీఫోకస్, 4కే UHD వీడియో రికార్డింగ్ ) , 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఫిక్సుడ్ ఫోకస్, 8ఎక్స్ డిజిటల్ జూమ్, ఎల్‌ఈడి ఫ్లాష్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ వోల్ట్ సపోర్ట్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై కాలింగ్, బ్లుటూత్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్), 3000mAh బ్యాటరీ.

Read More : మీ ఫోన్‌లో వైరస్ ఉందా? తీసేయటం ఎలా..?

లైఫ్ ఎఫ్1ఎస్

కొద్ది రోజుల క్రితమే రిలయన్స్ తన లైఫ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ LYF Water 3 పేరుతో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.6,599. ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్‌లను విక్రయిస్తోంది. 3000mAh బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ. డ్యుయల్ సిమ్ కార్డ్‌స్లాట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో ఒక సిమ్ మాత్రమే 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. మరొక సిమ్ లో 2జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేసే సిమ్ ను వాడుకోవచ్చు.

Read More : సామ్‌సంగ్ గెలాక్సీ జే5(2016) పై రూ.2,000 తగ్గింపు

లైఫ్ ఎఫ్1ఎస్

లైఫ్ వాటర్ 3 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ ను 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ. ఈ ఫోన్ పై వర్తించే రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ లో భాగంగా మార్చి 2017 వరకు జియో సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Lyf F1s with 5.2-inch Full-HD display, launched priced at Rs.9599. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X