Home
Mobile

రిలయన్స్ LYF ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు, 4జీ నెట్‌వర్క్ ఉచితం

By Sivanjaneyulu Bommu

లైఫ్ (LYF) బ్రాండ్ పేరిట మార్కెట్లో లాంచ్ అయిన 4జీ స్మార్ట్‌ఫోన్‌ల పై రిలయన్స్ భారీ ధర తగ్గింపును ప్రకటించింది. అంతేకాకుండా, ఈ ఫోన్‌లను సొంతం చేసుకునే యూజర్లకు మొదటి 3 నెలల పాటు అన్‌లిమిటెడ్ 4జీ నెట్‌వర్క్ సేవలను ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తోంది.

Read More : ఉత్తరప్రదేశ్‌లో గ్రహాంతరవాసుల కలకలం?

రిలయన్స్ 4జీ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు, 4జీ నెట్‌వర్క్ ఉచితం

దేశీయంగా రిలయన్స్ జియో నెట్‌వర్క్ సేవలు అధికారికంగా అందుబాటులోకి రానప్పటికి ఎంప్లాయ్ రిఫరల్ ప్రోగ్రామ్ క్రింద ఈ సేవలను యూజర్లకు అందుతున్నాయి. LYF స్మార్ట్‌‌ఫోన్‌లను కొనుగోలు చేసే యూజర్లులో ఎవరైనా CDMA కస్టమర్లు ఉన్నట్లయితే వారు తమ సిమ్ కార్డ్‌లను రిలియన్స్ జియోకు ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ధర తగ్గింపును అందుకున్న 6 LYF స్మార్ట్‌‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : రింగింగ్ బెల్స్ నుంచి రూ.251 ఫోన్, రూ.9,900 టీవీ (వచ్చేసాయ్)

LYF Water 2

LYF Water 2

లాంచ్ సమయంలో ఫోన్ ధర రూ.13,499
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.9,499

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ 720 పిక్సల్ డిస్‌ప్లే, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ 4జీ కనెక్టువిటీ, 3జీ, బ్లుటూత్, ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2,400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 LYF Wind 6

LYF Wind 6

లాంచ్ సమయంలో ఫోన్ ధర రూ.6,499
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.5,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ పేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమరా, 4జీ కనెక్టువిటీ, 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

LYF Flame 2

LYF Flame 2

లాంచ్ సమయంలో ఫోన్ ధర రూ.4,799
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.3,499

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4 అంగుళాల WVGA ఐపీఎస్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-పై, బ్లుటూత్, జీపీఎస్, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ ఫ్లేమ్ 4

లైఫ్ ఫ్లేమ్ 4

లాంచ్ సమయంలో ఫోన్ ధర రూ.3,999
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.2,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 225 పీపీఐ), ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్, 4జీ ఎల్టీఈ ఇంకా VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో పాటు వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిపచారు. 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. యాంటీ బ్యాండింగ్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ షట్టర్, పానోరమా షూట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ కెమెరాలలో పొందుపరిచారు. ఈ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 0 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఏర్పాటు 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 4.5 గంటల టాక్ టైమ్‌ను అందిస్తుంది.

 

లైఫ్ ఫ్లేమ్ 5

లైఫ్ ఫ్లేమ్ 5

లాంచ్ సమయంలో ఫోన్ ధర రూ.3,999
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.2,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ :


4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 225 పీపీఐ), ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్, 4జీ ఎల్టీఈ ఇంకా VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో పాటు వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిపచారు. 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. యాంటీ బ్యాండింగ్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ షట్టర్, పానోరమా షూట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ కెమెరాలలో పొందుపరిచారు. ఈ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 10 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.1650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ ఫ్లేమ్ 6

లైఫ్ ఫ్లేమ్ 6

లాంచ్ సమయంలో ఫోన్ ధర రూ.3,999
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.2,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 225 పీపీఐ), ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్, 4జీ ఎల్టీఈ ఇంకా VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో పాటు వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిపచారు. 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో ఈ ఫోన్ వస్తోంది. యాంటీ బ్యాండింగ్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ షట్టర్, పానోరమా షూట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ కెమెరాలలో పొందుపరిచారు. ఈ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 0 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.  1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 

 

Best Mobiles in India

English summary
6 Reliance LYF Smartphones get Price Cut and Free Unlimited 4G Data for 3 Months. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X