రిలయన్స్ జియో, గూగుల్ కాంభినేషన్‌లో స్మార్ట్‌ఫోన్
ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా జియో 4జీ నెట్‌వర్క్ పై రన్ అవుతుందట.
రిలయన్స్ జియో, గూగుల్ కాంభినేషన్‌లో సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా జియో 4జీ నెట్‌వర్క్ పై రన్ అవుతుందట.
Read More : రూ.10,000లోపు బెస్ట్ 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లు

జియో యాప్స్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌తో
ఈ ఏడాది చివరినాటికి మార్కెట్లో లాంచ్ కావొచ్చని భావిస్తోన్న ఈ ఫోన్‌లో
జియో యాప్స్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌తో కలిసి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయట. తద్వారా మెరుగైన స్మార్ట్‌ఫోన్ సేవలు సాధమ్యవుతాయని ఈ రెండు కంపెనీలు భావిస్తున్నాయట.

ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కూడా..
జియో స్మార్ట్ టీవీ సర్వీసులకు అవసరమైన ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కూడా ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

జియో ఫోన్‌లకు మరింతగా డిమాండ్
ఇప్పటికే ఫీచర్ ఫోన్ మార్కెట్ పై దృష్టిసారించిన రిలయన్స్ జియో రూ.1500 కంటే తక్కువ ధరలో 4జీ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసింది. తాజాగా గూగుల్తో జతకట్టటం వల్ల జియో డివైస్లకు మరింతగా డిమాండ్ పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

గూగుల్‌కు కలిసొచ్చే అవకాశం
గతకొద్ది సంవత్సరాలుగా గూగుల్, భారత్‌లో తన ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్ట్‌ను మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియోతో భాగస్వామ్యం గూగుల్‌కు కూడా కలిసొచ్చే అవకాశముంది.

ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్టు గురించి..
ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ గూగుల్ తన ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్టును 2014లో భారత్‌లో ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మైక్రోమాక్స్, కార్బన్ , స్పైస్, ఇంటెక్స్ వంటి దేశవాళీ బ్రాండ్‌లతో ఒప్పందం కదుర్చుకున్న గూగుల్ రూ.6000 రేంజ్‌లో ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫోన్‌లు ఆశించిన స్థాయిలో అమ్ముడుకాలేకపోవటంతో ప్రాజెక్ట్‌ను గూగుల్ నిలిపివేయాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications








