భవిష్యత్‌లో మరింత చౌక ధరలకే OLED స్మార్ట్‌ఫోన్‌లు

ఓఎల్ఈడి డిస్‌ప్లే ప్యానల్స్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భవిష్యత్‌లో మరింత తగ్గుముఖం పట్టబోతున్నాయి.

By GizBot Bureau
|

ఓఎల్ఈడి డిస్‌ప్లే ప్యానల్స్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భవిష్యత్‌లో మరింత తగ్గుముఖం పట్టబోతున్నాయి. ఇప్పుడు మీరు చదువుతున్నది నిజమే. జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ పానాసోనిక్, ఓఎల్ఈడి ప్యానల్స్ ను తయారు చేసేందుకు గాను జపాన్ డిస్‌ప్లేతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్యానల్స్ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతోన్న ఓఎల్ఈడి ప్యానల్స్‌తో పోలిస్తే 20 నుంచి 30 శాతం వరకు తక్కువ ధరలకే అందుబాటులో వచ్చేస్తాయట. దీంతో స్మార్ట్‌ఫోన్ తయారీ ఖర్చు మరింతగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

30 శాతం ఖర్చు డిస్‌ప్లే ప్యానల్‌కే..

30 శాతం ఖర్చు డిస్‌ప్లే ప్యానల్‌కే..

ప్రస్తుతం ఐఫోన్ ఎక్స్ తయారీలో 30 శాతం ఖర్చును డిస్‌ప్లేకే కేటాయించాల్సి వస్తోందట. ప్రస్తుత మార్కెట్‌ను పరిశీలించినట్లయితే OLED ప్యానల్స్ తయారీలో సామ్‌సంగ్ 90 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. యాపిల్ సహా అన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు సామ్‌సంగ్ వద్ద నుంచే డిస్‌ప్లేలను తీసుకుంటున్నాయి. త్వరలో ఈ సెగ్మెంట్‌లోకి పానాసోనిక్ అడుగుపెట్టబోతుండటంతో కంపెనీలకు మరొక ప్రత్యామ్నాయం లభించటంతో పాటు తక్కువ ధరలకే ప్యానల్స్ లభించే అవకాశం ఉంది.

 

 

యాపిల్ నుంచి ఫోల్డబుల్ డిస్‌ప్లే ఫోన్‌...

యాపిల్ నుంచి ఫోల్డబుల్ డిస్‌ప్లే ఫోన్‌...

ఫోల్డబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు గత కొద్ది సంవత్సరాలుగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా యాపిల్ కంపెనీ కూడా ఈ జాబితాలోకి చేరినట్లు తెలుస్తోంది. యాపిల్ తన ఐఫోన్ లైనప్ నుంచి ఓ ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2020 నాటికి మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

 

 

ఫోల్డబుల్ ఓఎల్ఈడి స్క్రీన్లను  ఎల్‌జీ తయారు చేస్తోంది!

ఫోల్డబుల్ ఓఎల్ఈడి స్క్రీన్లను ఎల్‌జీ తయారు చేస్తోంది!

స్మార్ట్‌ఫోన్‌లకు అవసరమైన ఫోల్డబుల్ ఓఎల్ఈడి స్ర్కీన్‌లను ఎల్‌జీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ఒకటైన ఎల్‌జీ డిస్‌ప్లే అభివృద్ధి చేస్తున్నట్లు దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ వెబ్‌సైట్ గతంలో ఓ కథనాన్ని రాసింది. మరో కంపెనీ అయిన ఎల్‌జీ ఇన్నోటెక్ ఈ ఫోన్‌లకు అవసరమైన ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ తయారీ పై వర్క్ చేస్తున్నట్లు ఇన్వెస్టర్ పేర్కొంది. వీటి తయారీకి సంబంధించిన ప్రొడక్షన్ ప్రాసెస్ 2019 నుంచి ప్రారంభమవుతుందట.

 

 

అగ్రగామిగా సామ్‌సంగ్..

అగ్రగామిగా సామ్‌సంగ్..

ప్రస్తుతం ఓఎల్ఈడి ప్యానల్స్ తయారీ విభాగంలో సామ్‌సంగ్ అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాదే మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సామ్‌సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గెలాక్సీ ఎక్స్ పేరుతో లాంచ్ రాబోతోన్న ఈ ఫోల్డబుల్ డిస్‌ప్లే ఫోన్, స్మార్ట్‌ఫోన్‌ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సామ్‌సంగ్ తాను సొంతంగా అభివృద్ది చేస్తున్న ఫోల్డబుల్ ఓఎల్ఈడి ప్యానల్స్‌లో కొన్నింటిని చైనా కంపెనీలకు సప్లై చేస్తుండటగా, మరికొన్నింటిని గెలాక్సీ ఎక్స్ తయారీకి ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

యాపిల్ కూడా భారీగా పెట్టుబడులు...

యాపిల్ కూడా భారీగా పెట్టుబడులు...

సామ్‌సంగ్ బాటలోనే ఎల్‌జీ కూడా ఫోల్డబల్ ఓల్ఈడి ప్యానల్స్‌ను అభివృద్థి చేస్తున్నట్లు ఇన్వెస్టర్ వెల్లడించింది. తాజా డెవలప్‌మెంట్‌లో భాగంగా ఈ ప్యానల్‌కు సంబంధించిన డ్యూరబులిటీ శాతాన్ని గణనీయంగా పెంచగలిగినట్లు వెల్లడైంది. ఈ ధైర్యంతో కొత్త ప్రొడక్షన్ ప్లాంట్‌ను ఎల్‌జీ ప్రారంభించబోతున్నట్లు తెలియవచ్చింది. దక్షిణ కొరియాలోని పాజు నగరంలో ఏర్పాటు కాబోతోన్న ఈ కొత్త ప్లాంట్‌లో యాపిల్ కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.

 

 

 

Best Mobiles in India

English summary
Remember Panasonic? It could make your smartphone cheaper.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X