రూ.501 ఫోన్ గుర్తుందా..?, సేల్ అనౌన్స్ చేసారు!

ఛాంప్1ఇండియా అనే కంపెనీ రూ.501కే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామంటూ మార్కెట్లో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌లకు సంబంధించిన మొదటి సేల్ సెప్టంబర్ 2న జరుగుతుందని లాంచ్ సమయంలో ఛాంప్1ఇండియా ప్రకటించినప్పటికి అది జరగలేదు. తాజాగా అందుతోన్న సమచారం ప్రకారం ఈ ఫోన్‌లకు సంబంధించిన మొదటి సేల్ నవంబర్ 18న జరుగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read More : ల్యాప్‌టాప్ తీసుకువెళ్లండి, 50 రోజుల తరువాత డబ్బులు చెల్లించండి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అందుబాటులో ఫోన్ బుకింగ్స్

ఈ ఫోన్ బుకింగ్స్ కూడా http://www.champ1india.com/లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

మీరు గుర్తుపెట్టుకోవల్సిన విషయం

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను బుక్ చేసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. ఈ ఫోన్ ఆన్‌లైన్ ఛానల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వైబ్‌సైట్‌లో బుక్ చేసే ఫోన్ పై పూర్తి బాధ్యత మీదే. మీరు ChampOne C1 పొందినట్లయితే ఆ ఎక్స్‌పీరియన్స్‌ను మాతో షేర్ చేసుకోగలరు.

రూ.7,999 విలువ చేసే ఫోన్ రూ.599కే

ఛాంప్1ఇండియా సంస్థ చెబుతోన్న లెక్కల ప్రకారం ఈ ఫోన్ వాస్తవ ధర రూ.7,999గా ఉందట. అయితే, లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ లో భాగంగా రూ.599కే అందించే ప్రయత్నం చేస్తున్నారట.

ఛాంప్‌వన్ సీ1 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Remember the Rs.501 Priced ChampOne C1 Smartphone? It’s Up for First Flash Sale on November 18!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot