ఫోన్ స్ర్కీన్ మారుస్తున్నారా? జాగ్రత్త, మీ ఫోన్‌ను హ్యాక్ చేసేస్తారు

స్ర్కీన్ రీప్లేసెమెంట్ వెనుక ఇంత రిస్క్ దాగి ఉంది కాబట్టి, మీ ఫోన్ స్ర్కీన్‌ను మార్చవల్సి వచ్చినపుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవటం మంచిది.

|

ఇప్పటి వరకు రకరకాల యాప్స్‌ను ఉపయోగించుకుని హ్యాకర్లు ఫోన్‌లను హ్యాక్ చేయటం గురించి మనం విన్నాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఫోన్ స్ర్కీన్ ద్వారా కూడా హ్యాకింగ్‌కు పాల్పడే ప్రమాదముందని ఇజ్రాయిల్‌కు చెందిన పరిశోధకలు హెచ్చరిస్తున్నారు.

SMS ద్వారా జియోఫోన్‌ను బుక్ చేసుకోవటం ఎలా..?SMS ద్వారా జియోఫోన్‌ను బుక్ చేసుకోవటం ఎలా..?

పాత స్ర్కీన్‌ను కొత్త  స్ర్కీన్‌తో రీప్లేస్ చేసే సమయంలో...

పాత స్ర్కీన్‌ను కొత్త స్ర్కీన్‌తో రీప్లేస్ చేసే సమయంలో...

ఫోన్ క్రింద పడి డ్యామేజ్ అయినపుడు ముందుగా ఎఫెక్ట్ అయ్యేది డిస్‌ప్లే. ఇలా జరిగినపుడు వెంటనే స్ర్కీన్‌ను రీప్లేసే చేసేస్తుటాం. అయితే, మార్చబోయే స్ర్కీన్ ద్వారానే హ్యాకింగ్ జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.

హానికరమైన చిప్‌ను అమర్చటం ద్వారా..

హానికరమైన చిప్‌ను అమర్చటం ద్వారా..

స్ర్కీన్ రీప్లేసెమెంట్ సమయంలో యూజర్ ఎంపిక చేసుకునే థర్డ్ పార్టీ టచ్‌స్ర్కీన్‌లలో హానికరమైన చిప్‌ను అమర్చటం ద్వారా ఎటువంటి స్మార్ట్‌ఫోన్‌నైనా హ్యాక్ చేయవచ్చని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

స్ర్కీన్‌లో చిప్ అమర్చిన తరువాత..

స్ర్కీన్‌లో చిప్ అమర్చిన తరువాత..

ఇలా జరిగినట్లయితే ఫోన్ పూర్తిగా హ్యాకర్ల చెప్పుచేతల్లోకి వెళ్లిపోతుందట. స్ర్కీన్‌లో చిప్ అమర్చిన తరువాత ఫోన్ కీబోర్డ్ ద్వారా మనం టైప్ చేసే పాస్‌వర్డ్స్ అలానే ప్యాట్రన్స్ హ్యాకర్లకు సులువుగా తెలిసిపోతాయి. ఫోన్‌ కెమెరా మీకు తెలియకుండానే ఆపరేట్ అవుతూ ముఖ్యమైన డేటాను హ్యాకర్లకు చేరువేస్తుంది. అంతేకాకుండా, మీ ప్రమేయం అనేదే లేకుండా రకరకాల హానికర యాప్స్ మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంటాయి.

10 డాలర్ల కంటే తక్కువ ధరకే..

10 డాలర్ల కంటే తక్కువ ధరకే..

ఈ ప్రమాదకర చిప్‌లు 10 డాలర్ల కంటే తక్కువ ధరకే తయారయ్యే అవకాశమున్న నేపథ్యంలో, వీటిని పెద్దమొత్తం తయారుచేసుకుని స్ర్కీన్‌లలో జొప్పించే ప్రమాదముందని Ben-Gurion University రిసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు.

యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు సైతం పసిగట్టలేవు..

యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు సైతం పసిగట్టలేవు..

స్ర్కీన్‌లలో ఈ చిప్‌లను పొందుపరిచిన విషయాన్ని ఏమాత్రం ఐడెంటిఫై చేయలేమని, ఆఖరికి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు సైతం ఈ చిప్‌లను పసగిట్టలేవని రిసెర్చర్స్ చెబుతున్నారు.

ముందుగా వాటిలో పరీక్షించి చూసారు.

ముందుగా వాటిలో పరీక్షించి చూసారు.

రీసెర్చ్ టీమ్ ఈ చిప్‌లను Huawei Nexus 6P, LG G Pad 7.0 స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌లలో ఎంబెడెడ్ చేసి పరీక్షించింది. ఈ ఫోన్‌లలో చిప్ పనిచేయటం ప్రారంభించిన తరువాత కీబోర్డ్ ఇన్‌పుట్స్‌ను రికార్డ్ చేయటం, యాప్స్ ఇన్‌స్టాల్ చేయటం, రిమోట్ కమాండ్స్ ద్వారా ఫోన్‌ను ఆపరేట్ చేయగలగటంతో పాటు kernel ఆపరేటింగ్ సిస్టంలోని సెక్యూరిటీ లోపాలను కూడా టార్గెట్ చేయగలిగింది.

ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవటం మంచిది

ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవటం మంచిది

స్ర్కీన్ రీప్లేసెమెంట్ వెనుక ఇంత రిస్క్ దాగి ఉంది కాబట్టి, మీ ఫోన్ స్ర్కీన్‌ను మార్చవల్సి వచ్చిన ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవటం మంచిది. ఇదే సమయంలో చౌక ధరల్లో వస్తున్నాయి కదా అని థర్డ్ పార్టీ స్ర్కీన్‌ల జోలికి వెళ్లకండి.

Best Mobiles in India

English summary
Replacement Screens With Malicious Chips Can Be Used to Control Your Phone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X