లావా రిపబ్లిక్ డే: స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీస్‌పై భారీ తగ్గింపులు.. రెండు రోజులే సమయం.. త్వరపడండి..!
రిపబ్లిక్ డే సందర్భంగా ఇండియాలో ఎలక్ట్రానిక్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే లావా ఇండియా సంస్థ స్మార్ట్‌ఫోన్లు, బెస్ట్ TWS ఇయర్‌బడ్స్‌తో సహా అన్ని యాక్సెసరీస్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ ఫ్లాట్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఓల్డ్ గ్యాడ్జెట్లను పక్కన పడేసి కొత్త వాటిని సొంతం చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడే కస్టమర్లకు ఇంకాస్త ఎక్కువ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్స్ ఉన్నాయి.
* లావా స్మార్ట్‌ఫోన్లపై స్పెషల్ డిస్కౌంట్లు
అగ్ని 3 స్మార్ట్‌ఫోన్ ధర రూ.22,999 లేదా రూ.24,999గా ఉంది. కానీ HDFC క్రెడిట్ కార్డ్ లేదా EMI ఆప్షన్స్‌తో కొంటే అక్షరాలా రూ.3,000 డిస్కౌంట్ అందుకోవచ్చు. లావా O3 (4GB RAM) స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.6,199కే లభిస్తోంది. పైగా HDFC క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్‌పై ఫ్లాట్ 5% డిస్కౌంట్ లేదా రూ.1,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

O3 (3GB వేరియంట్) స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,799గా ఉంది. HDFC క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఇది కూడా 5% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది, గరిష్టంగా రూ.1,000 వరకు డిస్కౌంట్ వస్తుంది. యువ 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,699. అయితే HDFC క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఏకంగా 10% డిస్కౌంట్, అంటే రూ.1,000 సేవ్ చేసుకోవచ్చు
బ్లేజ్ 5G స్మార్ట్‌ఫోన్ రూ.9,299కే లభిస్తుంది. HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే ఫ్లాట్ రూ.930 డిస్కౌంట్ అందుకోవచ్చు. బ్లేజ్ 3 మోడల్ మొబైల్ ధర రూ.11,499. HDFC క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొంటే ఫ్లాట్ రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. బడ్జెట్లో ఈ ఫోన్స్ బెస్ట్‌గా నిలుస్తున్నాయి కాబట్టి వీటిని ఒకసారి చెక్ చేయవచ్చు.
* లావా యాక్సెసరీస్ డిస్కౌంట్లు
లావా పాపులర్ నెక్ బ్యాండ్స్, ఇయర్‌బడ్స్‌పై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. ప్రోబుడ్స్ (PROBUDS) N31 నెక్ బ్యాండ్ అసలు ధర రూ.999 కాగా ఇప్పుడు కేవలం రూ.799 సేల్ అవుతుంది. అంటే డైరెక్ట్‌గా రూ.200 డిస్కౌంట్. ప్రోబుడ్స్ N32 నెక్ బ్యాండ్ అసలు ధర రూ.1,099, కానీ ఇప్పుడు రూ.100 డిస్కౌంట్‌తో రూ.999కే కొనొచ్చు.
ప్రోబుడ్స్ T31 TWS ఇయర్‌బడ్స్ అసలు ధర రూ.1,099, కానీ ఇప్పుడు రూ.999కే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కూడా రూ.100 డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. చౌక ధరకే మంచి సౌండ్ క్వాలిటీ కావాలనుకునేవారు వీటిని ఒకసారి చెక్ చేయవచ్చు.
* మరిన్ని స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు
లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,999 నుంచి రూ.15,999 మధ్య ఉంటుంది. అయితే HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే ₹1,000 డిస్కౌంట్ అందుకోవచ్చు. మామూలు సమయంలో బ్లేజ్ డ్యూయో స్మార్ట్‌ఫోన్ ధర రూ.16,999 నుంచి రూ.17,999 మధ్య ఉంటుంది. HDFC క్రెడిట్ కార్డ్, EMIలపై కొంటే ఏకంగా ₹2,000 డిస్కౌంట్ వస్తుంది.
బ్లేజ్ X మోడల్ ధర రూ.14,999 నుంచి రూ.16,999 మధ్య ఉంటుంది. HDFC క్రెడిట్ కార్డ్, EMI పద్ధతిలో కొంటే ఫ్లాట్ రూ.2,000 డిస్కౌంట్ మీ సొంతం. O3 ప్రో మొబైల్ ధర రూ.6,999. HDFC క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్‌పై 5% డిస్కౌంట్, గరిష్టంగా రూ.1,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
యువ 4 మోడల్ ధర రూ.7,099 నుంచి రూ.7,599 మధ్య ఉంటుంది. HDFC క్రెడిట్ కార్డ్ తో కొంటే రూ.355 నుంచి రూ.380 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. లావా స్ట్రోమ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ12,499గా ఉంది. ఈ మోడల్‌పై డైరెక్ట్‌గా రూ.1,500 ప్రైస్ డ్రాప్ ఆఫర్ ఉంది.
* ఆఫర్లు ఎప్పటి వరకు, ఎక్కడ కొనాలి
ఈ స్పెషల్ ఆఫర్లు 2025, జనవరి 24 నుంచి జనవరి 26 వరకు మాత్రమే ఉంటాయి. దగ్గర్లోని రిటైల్ స్టోర్స్‌లో వ్యాపాలతో నచ్చిన ప్రొడక్ట్ కొనవచ్చు. లావా అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా ఆర్డర్ చేయవచ్చు. ఇవి లిమిటెడ్ టైమ్ ఆఫర్లు, కాబట్టి లావా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీస్‌పై అదిరిపోయే సేవింగ్స్ సొంతం చేసుకోవడానికి త్వరపడండి.


Click it and Unblock the Notifications








