'రీసెర్చి ఇన్‌ మోషన్‌' ఎండీగా సునీల్‌దత్‌

Posted By: Prashanth

'రీసెర్చి ఇన్‌ మోషన్‌' ఎండీగా సునీల్‌దత్‌

 

న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌ని రూపొందించే సంస్థ రీసెర్చి ఇన్‌ మోషన్‌ భారత్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సునీల్‌దత్‌ను ఎంపిక చేయడం జరిగిందని రీసెర్చ్ ఇన్ మోషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉర్పో కర్జాలనైనా తెలిపారు. సునీల్ దత్‌కు టెలికంరంగంతో పాటు భారతీయ మొబైల్‌ పరిశ్రమలో ఆయనకు 27 ఏళ్ల అనుభవం ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భారత్‌ బ్లాక్‌బెర్రీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దత్‌ అనుభవం కలిసి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు సునీల్ దత్‌ ట్రాక్ రికార్డుని పరిశీలించినట్లేతే హెవ్లెట్‌ పేకర్డ్‌ ఇండియాలో ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అంతకు ముందు పలు కంపెనీలు స్యామ్‌సంగ్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌తోపాటు నోకియా ఇండియా, వ్రిల్‌పూల్‌ ఇండియా లిమి టెడ్‌, విప్రోలిమిటెడ్‌, ఫిలిప్స్‌ ఇండియా లాంటి కంపెనీల్లో సీనియర్‌ హోదాల్లో పనిచేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot