రానున్న ఫోన్లకు బ్యాటరీ అవసరమే ఉండదట !

Written By:

రానున్న ఫోన్లలో బ్యాటరీ ఉండదట. బ్యాటరీ లేకుండానే ఫోన్లు రానున్నాయి. శాస్ర్తవేత్తలు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.బ్యాటరీ ఫ్రీ ఫోన్లను తయారు చేయడంలో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సైంటిస్టులు నిమగ్నమైనట్టు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా చానల్ తెలిపింది.

మీ ఫోన్ పోయిందా.. అది పని చేయదు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్యాటరీ బ్యాకప్ విషయంలో

ప్రస్తుతం ఏ సెల్‌ఫోన్‌ను తీసుకున్నా బ్యాటరీ లైఫ్ అనేది తప్పనిసరి అయిందని అయినప్పటికీ బ్యాటరీ బ్యాకప్ విషయంలో యూజర్లు సమస్యలను ఎదుర్కొంటున్నారని సదరు సైంటిస్టులు చెబుతున్నారు.

బ్యాటరీ అనేది లేని ఫోన్‌ను

ఈ క్రమంలో బ్యాటరీ అయిపోతున్నప్పుడు కచ్చితంగా చార్జింగ్ చేసుకోవాల్సి వస్తుందని, అయితే ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అసలు బ్యాటరీ అనేది లేని ఫోన్‌ను తయారు చేయడం ప్రారంభించామని వారు చెబుతున్నారు.

ప్రయోగాలు చాలా వరకు

తమ ప్రయోగాలు చాలా వరకు విజయవంతమయ్యాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సైంటిస్టు బృందం తెలియజేస్తున్నది.

కాంతి లేదా రేడియో తరంగాలను

ఫోన్‌కు ప్రత్యేకంగా అమర్చే పరికరం కాంతి లేదా రేడియో తరంగాలను తీసుకుని దాన్నుంచి విద్యుత్‌ను తయారు చేసి ఫోన్‌కు ఇస్తుందని, దీంతో అలాంటి ఫోన్ సాధారణ బ్యాటరీ ఫోన్ కన్నా ఎక్కువ సమయం పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో

ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉన్న తమ ప్రయోగాలు త్వరలోనే ముగుస్తాయని అప్పుడు పూర్తి వివరాలు తెలియజేస్తామని వారు అంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Researchers build world’s first battery-free mobile phone Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot