అమెజాన్‌లో వన్‌ప్లస్ 6 ఫస్ట్ అండ్ ఫాస్ట్ సేల్ స్టార్ట్ అయింది

|

ఎప్పటినుంచో అభిమానులు ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 6 లాంచ్ కు సర్వం సిద్ధం అయింది. ఈ రోజు లండన్ లో ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ ను కంపెనీ అఫిషియల్ గా లాంచ్ కానుంది. రేపు ఇండియాలో మొంబైల్ జరిగే అట్టహస వేడుకలో కంపెనీ అఫిషయల్ గా ఈఫోన్ లాంచ్ కానుంది. అయితే అభిమానుల కోసం ముందుగానే బుకింగ్ సౌకర్యాన్ని అమెజాన్ కల్పిస్తోంది. Fast AF ఈ పేరుతో అమెజాన్ ఈ రకమైన సేల్ కి తెరలేపింది. ఈ నెల 13 నుంచి 16 మధ్య కాలంలో అమెజాన్ వన్‌ప్లస్ అభిమానుల కోసం ప్రీ ఆర్డర్లను స్వీకరిస్తోంది. కాగా ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ అమెజాన భాగస్వామ్యంలో ఎక్స్ క్లూజివ్ గా ఇండియాలో లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే.

 

వన్‌ప్లస్ 6 కెమెరా ఎలా ఉండబోతోంది,అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠవన్‌ప్లస్ 6 కెమెరా ఎలా ఉండబోతోంది,అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ

Amazon.in ద్వారా..

Amazon.in ద్వారా..

ఈ ఫోన్ లాంచింగ్ రోజునే దీన్ని బుక్ చేసుకోవాలనుకునే వారికోసం అమెజాన్ ఈ రకమైన అమ్మకాలకు తెరలేపింది. ఇందులో భాగంగా ఆఫర్లను కూడా ప్రకటిస్తోంది. May 2018 21 నుంచి 22 మధ్య కాలంలో Amazon.in ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేసేవారికి కంపెనీ రూ.1000 గిఫ్ట్ కార్డుని కూడా అందిస్తోంది. అలాగే వన్ ప్లస్ కంపెనీ రూ.1000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ని అమెజాన్ పే బ్యాలన్స్ ద్వారా అందిస్తోంది.

 రూ.1000 గిప్ట్ కార్డుని కొనుగోలు..

రూ.1000 గిప్ట్ కార్డుని కొనుగోలు..

అయితే దీని కోసం మీరు ముందుగా రూ.1000 గిప్ట్ కార్డుని కొనుగోలు చేయాలి. దాన్ని తరువాత మీరు ఫోన్ కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు. ఇలా కొనుగోలు చేసిన వారికి రూ.2000 ( కొనుగోలు కార్డు , క్యాష్ బ్యాక్ కలిపి) ఫోన్ కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు.

3 నెలల manufacturer warranty
 

3 నెలల manufacturer warranty

ఈ ఫోన్ ఈ నెల 21 నుంచి ఫోన్ అమ్మకానికి వెళుతుంది. ఈ ఫోన్ కొనుగోలు సమయంలో కొనుగోలు దారులకు 3 నెలల manufacturer warrantyతో పాటు సంవత్సరం పాటు వారంటీ కూడా అందిస్తోంది.

లాంచింగ్ కు ముందే ప్రీ ఆర్డర్లను..

లాంచింగ్ కు ముందే ప్రీ ఆర్డర్లను..

ఆసక్తి ఉన్న అభిమానుల కోసం కంపెనీ లాంచింగ్ కు ముందే ప్రీ ఆర్డర్లను ప్రారంభించడం నిజంగా ఆహ్వనించదగ్గపరిణామమే. కాగా ఈఫోన్ గతకొద్ది రోజుల నుంచి లీకులతో సంచలనం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కెమెరా విషయంలో ఈ ఫోన్ అనేక అంచనాలను రేకెత్తిస్తోంది.

ఫీచర్ల విషయానికొస్తే..

ఫీచర్ల విషయానికొస్తే..

5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1800 x 3200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, వెనుక భాగంలో 23 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌లో లభ్యం కానున్నాయి.

Best Mobiles in India

English summary
Reserve your OnePlus 6 right now in the first-ever ‘Fast AF' Sale on Amazon.in More News at Gizbot Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X