నోకియా అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్తే..Hmd గ్లోబల్ నుంచి నోకియా 2 అతి త్వరలో మార్కెట్లోకి దూసుకురానుందని లీకేజీ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. బడ్జెట్ ధరలో నోకియా ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేయడం ద్వారా నోకియా కోల్పోయిన తన పాత ప్రస్థానాన్ని మళ్ల అందుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే బడ్జెట్ ధరలో నోకియా2ని కంపెనీ తీసుకొస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. లీకయిన వివరాల ప్రకారం..
లేటెస్ట్‌గా వచ్చిన బెస్ట్ మోటో ఫోన్లపై ఓ లుక్కేయండి
నోకియా 2 తొలిసారిగా యుఎస్ మార్కెట్లో..
కంపెనీ నుండి వస్తున్న రూమర్ల ప్రకారం నోకియా 2 తొలిసారిగా యుఎస్ మార్కెట్లో ప్రత్యక్షం కానుందని తెలుస్తోంది. అక్కడ దీని ధర 99 డాలర్లుగా ఉండే అవకాశం ఉంది.
అత్యంత ఛీపెస్ట్ ఫోన్ గా నోకియా 3
ఇప్పటిదాకా కంపెనీ నుంచి వచ్చిన అత్యంత ఛీపెస్ట్ ఫోన్ గా నోకియా 3 నిలిచింది. దీని ధర రూ. 9,500గా ఉంది. అయితే రానున్న నోకియా2 ఈ స్థానాన్ని ఆక్రమిస్తుందని తెలుస్తోంది.
ఫోన్ బ్లాక్, వైట్ వేరియంట్లలో
ఈ లీకేజి వివరాలు Winfuture.de అనే సైట్లో ప్రత్యక్షమయ్యాయి. రానున్న ఈ ఫోన్ బ్లాక్, వైట్ వేరియంట్లలో యుఎస్ మార్కెట్లోకి రానుందని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను FCCలో ఇప్పటికే కంపెనీ నమోదు చేసింది.
4000mAh batteryతో
మోడల్ నంబర్ TA-1035తో ఈ ఫోన్ రానుంది. డ్యూయెల్ సిమ్ తో పాటు 4000mAh batteryతో ఈ ఫోన్ సందడి చేయనుంది. నోకియా2లో ఇదే అతి పెద్ద హైలెట్ గా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Qualcomm Snapdragon 212 chipset
గీక్ బెంచ్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం నోకియా 2 5 ఇంచ్ డిస్ ప్లేతో పాటు, entry-level Qualcomm Snapdragon 212 chipsetతో రానుంది.
1జిబి ర్యామ్
అలాగే 1జిబి ర్యామ్, 8జిబి స్టోరేజి, 8 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లు ఉండనున్నాయి.
ఫోన్ లాంచ్ తేదీ ఎప్పుడనేది మాత్రం..
అయితే ఈ ఫోన్ లాంచ్ తేదీ ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. నోకియా 9తో పాటే ఇది కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని రూమర్లను బట్టి తెలుస్తోంది. నోకియా 9 వచ్చే ఏడాది మార్కెట్లో సందడి చేయనుంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.