విపణిలోకి త్వరలో రానున్న మోటరోలా మోటో ఎమ్టి 870

Posted By: Staff

విపణిలోకి త్వరలో రానున్న మోటరోలా మోటో ఎమ్టి 870

ప్రపంచంలో ఉన్నటువంటి మొబైల్ తయారీదారు సంస్దలలో నాణ్యమైనటువంటి మొబైల్స్‌ని అందించే కంపెనీలలో మోటరోలా ఒకటి. ఇండియన్ మార్కెట్‌లో మోటరోలాది ప్రత్యేకమైనటువంటి స్దానం. ఇండియన్ సిటీలలో మోటరోలా మంచి ఉత్పత్తులను కస్టమర్స్‌కు అందించడమే కాకుండా గతంలో భారతీయులకు చిన్న చిన్న హ్యాండ్ సెట్‌ల నుండి మొదలకోని హైయర్ ఎండ్ సెట్లు వరకు కూడా విడుదల చేసింది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌లో అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ మొదలగునవి మార్కెట్‌లో హాల్ చల్ చేస్తుండగా మోటరోలా కూడా మోటో ఎమ్టి 870 అనే మొబైల్‌ని మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.

మోటరోలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్నటువంటి మోటో ఎమ్టి 870 అమెరికా, యూరప్ దేశాలకు 2011 మద్యమార్దంలో వస్తుండగా, ఇక ఆసియా దేశాలలో మొబైల్ మార్కెట్‌లోకి 2011చివరలో ప్రవేశపెట్టనున్నారు. ఇక మోటరోలా మోటో ఎమ్టి 870 విషయానికి వస్తే చూడడానికి చాలా సన్నగా ట్రెండీగా ఉంటే మొబైల్ హ్యాండ్ సెట్. స్క్రీన్ సైజు 4 ఇంచ్‌లు కలిగి ఉండి ఫోన్ చూడడానికి చక్కని ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుంది. మోటో ఎమ్టి 870 ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నటువంటి స్మార్ట్ పోన్స్ ఏవిధంగానైతే అన్ని మల్టీమీడియా ఫీచర్స్ సపోర్టు చేస్తున్నాయో అదేవిధంగా మోటో ఎమ్టి 870 కూడా సపోర్టు చేస్తుంది.


ఇందులో ఉన్నటువంటి మ్యూజిక్ ప్లేయర్ వీడియో రికార్డింగ్, ప్లేబ్యాక్‌లను సపోర్టు చేస్తుంది. ఇక ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ వెరైటి వీడియో ఫార్మెట్‌లను సపోర్టు చేస్తున్న విషయం తెలిసిందే. మోటరోలా మోటో ఎమ్టి 870లో ముందు భాగాన ఉన్నటువంటి కెమెరా వీడియో కాలింగ్‌కి, వెనుక భాగాన ఉన్నటువంటి కెమెరా వీడియో రికార్డింగ్ తీయడంలో ఉపయోగపడతాయి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే వై-పై ఇంటర్నెట్ కనెక్టివిటీ, బ్యూటూత్, యుఎస్‌బి పిసి సింక్రనైజేషన్ మొదలగునవాటికి అన్నింటికి అనుకూలం.

ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ GPRS, EDGE లాంటి వాటిని కూడా సపోర్టు చేస్తుంది. మోటరోలా మోటో ఎమ్టి 870 2.3 జింజర్ బ్రెడ్ వర్సన్ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఫోన్‌తో పాటు కొంత మొమొరీ వస్తుండగా ఇంకా ఏమైనా మొమొరీని ఎక్పాండ్ చేసుకోవాలంటే అందుకు గాను మైక్రో ఎస్‌డి స్లాట్ ఇందులో ప్రత్యేకం.

The expected Motorola Moto MT 870 features are

Touch Screen display
8 Mega Pixel camera with LED flash
Android 2.3 Gingerbread OS
Bluetooth and Wi-Fi
2G and 3G support
Java support
720p video recording
3.5 mm audio jack
Long battery life

మోటరోలా మోటో ఎమ్టి 870లో మంచి స్మార్ట్ ఫోన్‌కు ఉండాల్సినటువంటి ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఇక దీని ఖరీదు వెల్లడించడానికి మోటరోలా ఇంకొంత సమయం కోరడమైంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot