రిమ్ బోర్డ్ ప్రక్షాళణ, కొత్త బోర్డు సుభ్యుల్లో భారత సంతతికి చెందిన ప్రేమ్ వాట్సా!!

Posted By: Prashanth

రిమ్ బోర్డ్ ప్రక్షాళణ, కొత్త బోర్డు సుభ్యుల్లో భారత సంతతికి చెందిన ప్రేమ్ వాట్సా!!

 

బ్లాక్‌బెర్రీ తయారీ సంస్థ రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) కోచైర్మన్ జిమ్ బాల్‌సిల్లీ, కోసిఈవో మైక్ లాజార్డిస్ తమ పదవుల నుంచి తప్పుకున్నారు. తీవ్రమైన పోటీలో తమ మార్కెట్ వాటాను గణనీయంగా కోల్పోయిన ఈ కంపెనీ తిరిగి పూర్వ ప్రభవాన్ని పొందడానికి చేపట్టిన చర్యల్లో భాగంగానే వీరిద్దరు ఉన్నతాధికారులను తప్పించినట్లు తెలుస్తోంది.

భారతీయ సంతతికి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ సహా నూతన అధికార బృందాన్ని కంపెనీ తిరిగి నియమించింది. సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళుతున్న తమ సంస్థ కొత్త అధ్యక్షుడు, సిఈవోగా థోర్‌స్టన్ హెయిన్స్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని రిమ్ డైరెక్టర్ల బోర్డు వెల్లడించింది.

హెయిన్స్‌ను తక్షణం రిమ్ బోర్డులో నియమిస్తున్నట్లు తెలిపింది. స్వతంత్ర బోర్డు అధ్యక్షునిగా బార్బరా స్టెమియెస్ట్, అలాగే రిమ్ బోర్డు వైస్ చైర్మన్‌గా, రిమ్ కొత్త ఇన్నోవేషన్ కమిటీ చైర్మన్‌గా నియమించినట్లు ప్రకటించింది. భారతీయ సంతతకి ప్రేమ్ వాత్సను రిమ్ బోర్డులో చేర్చుకున్నారు. దీంతో బోర్డు సభ్యుల సంఖ్య 11కు చేరిందని కంపెనీ తెలియజేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot