2000 మందికి ఉద్వాసన పలికిన బ్లాక్‌‍బెర్రీ తయారీదారు రిమ్

Posted By: Staff

2000 మందికి ఉద్వాసన పలికిన బ్లాక్‌‍బెర్రీ తయారీదారు రిమ్

బ్లాక్‌‍బెర్రీ మొబైల్ తయారీదారు రీసెర్చ్ ఇన్ మోషన్ నిన్న 2000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికనట్లు తెలిపింది. దీనితోపాటు బ్లాక్‌‍బెర్రీ ట్విట్టర్ ఎకౌంట్లో బ్లాక్‌‍బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్ బెర్రీ ఓఎస్ 7తో రన్ అయ్యేటటువంటి రెండు స్మార్ట్ పోన్స్‌ని కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. ఇది ఇలా ఉంటే రీసెర్చ్ ఇన్ మోషన్ సంస్ద తన కంపెనీ ఉద్యోగులను 17, 000లకు తగ్గించింది. దీనికి కారణం ప్రస్తుతం బ్లాక్‌‍బెర్రీ మొబైల్స్ సేల్స్ ఆశించినంతగా రాకపోవడమేనని బ్లాక్‌‍బెర్రీ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. దీనితో పాటు ఆపిల్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్ నుండి గట్టి పోటీని ఎదుర్కోడమే ఉద్యోగులను తగ్గించుకోవడానికి కారణం అని తెలియజేశారు.

ఇక రాబోయే కాలంలో రీసెర్చ్ ఇన మోషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న ప్రాజెక్టుల గురించి ఆలోచించడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతుందంటే స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో తిరిగి నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకునే దిశగా మా యొక్క స్ట్రాటజీ ప్లాన్స్ ఉంటాయని అన్నారు. ఈ సంవత్సరం చివరికల్లా కెనడియన్ కంపెనీ నుండి 7 బ్లాక్‌‍బెర్రీ స్మార్ట్ ఫోన్స్‌ని బ్లాక్‌‍బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ 7తో విడుదల చేయనున్నామని తెలిపారు.

రీసెర్చ్ ఇన్ మోషన్ ఆఫీసియల్ ట్విట్టర్ పేజిలో మంగళవారం బ్లాక్‌‍బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ 7తో రన్ అయ్యేటటువంటి మొబైల్స్ డిటేల్స్ విడుదల చేయడం జరుగుతుందని ట్వీట్ చేశారు. బ్లాక్‌‍బెర్రీ త్వరలో విడుదల చేయనున్న స్మార్ట్ ఫోన్స్ ఇలా ఉన్నాయి. BlackBerry Bold 9900/9930 and BlackBerry Torch 9810గా ప్రకటించడం జరిగింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot