సల్మాన్ చేతుల మీదగా ఇండియాలోకి బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ టాబ్లెట్

Posted By: Super

సల్మాన్ చేతుల మీదగా ఇండియాలోకి బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ టాబ్లెట్

న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ ఫోన్లను తయారు చేస్తున్న రిసెర్చ్‌ ఇన్‌ మోషన్‌ (ఆర్‌ఐఎమ్‌) 'ప్లేబుక్‌' ట్యాబ్లెట్‌ కంప్యూటర్‌ను దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఇవి రూ.27,990 (16జీబీ సామర్థ్యం కలిగినది), రూ.32,990 (32జీబీ), రూ.37,990 (64జీబీ సామర్థ్యం కలిగినది) ధరల్లో లభ్యం అవుతాయి. రిమ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ క్యూఎన్‌ఎక్స్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌ అభివృద్ధి చేసిన కొత్త ఆపరేటింగ్‌ వ్యవస్థపై ప్లేబుక్‌ పని చేస్తుంది. 7 అంగుళాలున్న ప్లేబుక్‌ను భారత్‌లోనే కాక మరో 15 దేశాల్లో కంపెనీ ప్రవేశపెట్టనుంది. చిన్నగా ఉన్నప్పటికీ.. పర్సనల్‌ కంప్యూటర్‌ స్థాయిలో పని చేయడంతో దేశీయ మార్కెట్‌లో ట్యాబ్లెట్‌ పీసీలకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన దేశాల్లో ప్లేబుక్‌కు మిశ్రమ స్పందన లభించింది. భారత్‌ మార్కెట్‌లో బ్లాక్‌బెర్రీ ఫోన్‌కు లభించిన స్థాయిలోనే దీనికీ ఆదరణ లభించగలదని రిమ్‌ భావిస్తోంది. భారత్‌లో 10 లక్షలకు పైగా వినియోగదారులు బ్లాక్‌బెర్రీని వినియోగిస్తున్నారు.

BlackBerry Playbook Tablet Features and Specs:

Dimensions: 7.6

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot