బ్లాక్‌బెర్రీ టార్చ్‌ 9860 ధర, ప్రత్యేకతలు

Posted By: Super

బ్లాక్‌బెర్రీ టార్చ్‌ 9860 ధర, ప్రత్యేకతలు

బ్లాక్‌బెర్రీ పేరంట్ కంపెనీ అయిన కెనడియన్ రీసెర్చ్ ఇన్ మోషన్ సంస్ద మార్కెట్లోకి కొత్తగా బుధవారం నాడు బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860 స్మార్ట్ ఫోన్‌ విడుదల చేసింది. దీని ధర రూ.28,490 కాగా కొత్త బ్లాక్‌బెర్రీ 7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా పనిచేస్తుంది. బ్లాక్‌బెర్రీ టార్చ్‌ 9860కు అదనపు ఆకర్షణలు ఆలా ఉన్నాయి. 7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా బ్రౌజింగ్‌ స్పీడ్‌గా ఉంటుందని రిమ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఫెర్నెబావాచెప్పారు.

బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860 మొబైల్ ఫెర్పామెన్స్ స్పీడ్‌గా ఉండేందుకు గాను 1 జీహెచ్‌జీ సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తోపాటు 3.7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ద్వారా వెబ్‌పేజీలు, ఫోటోలు, వీడియో లతో పాటు పవర్‌ఫుల్‌ గేమింగ్‌ ఫీచర్స్ యూజర్స్ కొసం ప్రత్యేకంగా రూపోందించడం జరిగింది. కమ్యూ నికేషన్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు వీడి యో రికార్డింగ్‌ కూడా అనుకూలంగా ఉంటుంది.

బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860 మొబైల్ వెనుక భాగాన 5 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు హై డెఫినేషన్ వీడియోని 720p ఫార్మెట్లో సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయినటువంటి బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి సింక్ తో పాటు , 2జీ ఇంటర్నెట్ టెక్నాలజీలైన GPRS, EDGEలను కూడా సపోర్ట్ చేస్తుంది. హై స్పీడ్ ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860 మొబైల్ జిఎస్‌ఎమ్ సిమ్ కోసం తయారు చేయడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot