40 సంవత్సరాల చరిత్ర మాది.. అందుకే

Posted By: Staff

40 సంవత్సరాల చరిత్ర మాది.. అందుకే

బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్స్‌ని తయారు చేసేటటువంటి రీసెర్చ్ ఇన్ మోషన్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న మొబైల్ అభిమానుల కొసం బ్లాక్‌బెర్రీ పోర్స్చే డిజైన్ పి9981 మొబైల్‌ని విడుదల చేసింది. ఈ సందర్బంగా పోర్స్చే డిజైన్ గ్రూప్ సిఈవో గెస్సలర్ మాట్లాడుతూ 1972వ సంవత్సరం నుండి పోర్స్చే డిజైన్ అత్యాధునిక ఉత్పత్తులను, ఐకానిక్ మైల్ స్టోన్ ప్రొడక్టులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు రాబోయే ఈ బ్లాక్‌బెర్రీ పోర్స్చే డిజైన్ పి9981 మొబైల్ మార్కెట్లో ఓ సంచలనాన్ని సృష్టిస్తుందని అన్నారు.

మొబైల్ ఫీచర్స్‌ని ఒక్కసారి గమనించినట్లేతే బరువు 155గ్రాములు. చుట్టుకొలతలు 115 x 67 x 11.3 mm. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.8 ఇంచ్ స్క్రీన్‌తో 640 x 480 ఫిక్సల్ రిజల్యూషన్ డిస్ ప్లేని కలిగి ఉంది. టిఎఫ్‌టి కెపాసిటివ్ టచ్ స్కీన్‌తో పాటు, క్వర్టీ కీప్యాడ్ దీని సొంతం. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం.

బ్లాక్‌బెర్రీ పి9981 మొబైల్ 768MB RAMని కలిగి ఉంది. మొబైల్‌లో ఇంటర్నల్‌గా 8GB మెమరీని నిక్షిప్తం చేయగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. కమ్యూనికేషన్, కనెక్టివిటీ పీచర్స్ అయిన బ్లూటూత్, వై-పై 802.11 b/ g/ n లను సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యేందుకు గాను జిపిఆర్‌ఎస్, ఎడ్జి టెక్నాలజీలు ప్రత్యేకం.

బ్లాక్‌బెర్రీ పి9981 మొబైల్ బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ 7.0తో రన్ అవుతుంది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను 1.2 GHz ప్రాసెసర్ తో పాటు, క్వాలికామ్ MSM8655 చిఫ్ సెట్‌ని నిక్షిప్తం చేశారు. మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీయవచ్చు. మొబైల్ ఫీచర్స్‌గా ఎల్‌ఈడి ఫ్లాష్ ప్రత్యేకం. వీడియో రికార్డింగ్‌ని తీయాల్సి వస్తే 720p ఫార్మెట్లో ఈ మొబైల్ వీడియో రికార్డింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1000mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. రీసెర్చ్ ఇన్ మోషన్ ఇంకా మార్కెట్లో దీని ధరను ప్రవేశపెట్టలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot