రింగింగ్ బెల్స్ రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

రూ.251కే స్మార్ట్‌‌ఫోన్ అందిస్తామంటూ ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రింగింగ్ బెల్స్ సంస్థ తన ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్‌లను జూన్ 28 నుంచి డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌లను ముందుగా బుక్ చేసుకున్న వారికి డెలివరీ చేస్తామని రింగింగ్ బెల్స్ కంపెనీ డైరెక్టర్ మోహిత్ గోయల్ తెలిపారు.

రింగింగ్ బెల్స్ రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

Read More : ఈ ATM పిన్ నెంబర్స్ వాడకండి!

ఫిబ్రవరిలో జరిగిన బుకింగ్స్‌కు గాను, దేశవ్యాప్తంగా తమ ఫ్రీడమ్ 251 ఫోన్‌ల కోసం 7 కోట్ల మంది రిజస్టర్ కాగా, 30 వేల మంది క్యాష్ ఆన్ డెలివరీ ప్రాతిపదికన ఫోన్‌లను బుక్ చేసుకున్నట్లు గోయల్ పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. వీరికి జూన్ 28 నుంచి ఫోన్ డెలివరీ ఉంటుందని మోహిత్ ప్రకటించారు.

రింగింగ్ బెల్స్ రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

'ఫ్రీడమ్ 251' స్మార్ట్‌ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న 30,000 మందికి డబ్బు వాపసు చేసినట్లు రింగింగ్ బెల్స్ సంస్థ రెండు నెలల క్రితమే తెలిపింది. మరింత పారదర్శకంగా వ్యవహరించేందుకు ఫోన్ డెలివరీ చేసిన తరువాతే, వారి వద్ద నుంచి డబ్బు తీసుకుంటామని కంపెనీ వెల్లడించిన విషయం తెలిసిందే.

Read More : 6జీబి ర్యామ్‌తో ఫోన్, ఆ ధరే నిజమైతే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్రీడమ్ 251 ఫోన్ స్పెసిఫికేషన్స్ (కంపెనీ అధికారికంగా వెల్లడించినవి)

ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్ 4 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. (రిసల్యూషన్ సామర్థ్యం 960x540పిక్సల్స్).

ఫ్రీడమ్ 251 ఫోన్ స్పెసిఫికేషన్స్ (కంపెనీ అధికారికంగా వెల్లడించినవి)

1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచారు.

ఫ్రీడమ్ 251 ఫోన్ స్పెసిఫికేషన్స్ (కంపెనీ అధికారికంగా వెల్లడించినవి)

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.

ఫ్రీడమ్ 251 ఫోన్ స్పెసిఫికేషన్స్ (కంపెనీ అధికారికంగా వెల్లడించినవి)

ఈ డివైజ్‌లో 1జీబి ర్యామ్‌తో పాటు 8జీబి ఇంటర్నల్ మెమరీని పొందుపరిచారు. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకోవచ్చు. ఇవి స్పెక్స్‌తో ప్రస్తుత మార్కెట్లో దొరుకుతున్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 అంతకంటే ఎక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

ఫ్రీడమ్ 251 ఫోన్ స్పెసిఫికేషన్స్ (కంపెనీ అధికారికంగా వెల్లడించినవి)

ఫోన్ వెనుక భాగంలో 3.2 మెగా పిక్స్ రేర్ ఫేసింగ్, ముందు భాగంలో 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఏర్పాటు చేసారు. తక్కువ వెళుతురులోనూ ఫోటోలు తీసుకునే వింధంగా ఫ్లాష్ సపోర్ట్ ను ఈ ఫోన్‌లో కల్పించారు.

ఫ్రీడమ్ 251 ఫోన్ స్పెసిఫికేషన్స్ (కంపెనీ అధికారికంగా వెల్లడించినవి)

డమ్ 251 స్మార్ట్‌ఫోన్ 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 1450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫ్రీడమ్ 251 ఫోన్ స్పెసిఫికేషన్స్ (కంపెనీ అధికారికంగా వెల్లడించినవి)

కంపెనీ చెబుతోన్న దాని ప్రకారం. ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్ ఒక సంవత్సరం వారంటీతో లభ్యమవుతుంది.

ఫ్రీడమ్ 251 ఫోన్ స్పెసిఫికేషన్స్ (కంపెనీ అధికారికంగా వెల్లడించినవి)

ఉమెన్ సేఫ్టీ, స్వచ్ భారత్, ఫిషర్ మాన్, ఫార్మర్, మెడికల్, గూగుల్ ప్లే, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ఉపయోగకరమైన యాప్స్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసారు.

ఫ్లాష్‌‍బ్యాక్‌లోకి వెళితే..?

రూ.2,500 ఫోన్‌ను రూ.251కే అందిస్తున్నామని రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించంతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఫ్రీడమ్ 251 పేరుతో ఆవిష్కరించబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు చాలా మంది ఆసక్తిని కనబరిచారు.

ఫ్లాష్‌‍బ్యాక్‌లోకి వెళితే..?

ఫిబ్రవరిలో భారీ అంచనా మధ్య ప్రారంభమైన ఈ ఫోన్ బుకింగ్స్‌కు అడుగడుగుగా అవాంతరాలే ఎదురయ్యాయి. ఆది నుంచి ఫ్రీడమ్ 251 వెబ్‌సైట్ మెరాయిస్తుండటంతో నెటిజనులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చారు.

 

ఫ్లాష్‌‍బ్యాక్‌లోకి వెళితే..?

ఇన్ని అవాంతరాలు ఎదరైనప్పటికి ఫ్రీడమ్ 251 ఫోన్‌లకు సంబంధించి తాము 7 కోట్ల రిజిస్ట్రేషన్లు పొందామని రింగింగ్ బెల్స్ చెప్పుకొచ్చింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్‌లు జరగటం విశ్లేషకులను సైతం కలవరపరిచింది.

 

ఫ్లాష్‌‍బ్యాక్‌లోకి వెళితే..?

ఒక్కో మెయిల్ ఐడీ పై ఒక ఫోన్‌ను మాత్రమే బుక్ చేసుకునేలా రింగింగ్ బిల్స్ నిబంధనను సెట్ చేసినప్పటికి ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడమనేది ఆసక్తికర చర్చకు దారి తీసింది.

 

ఫ్లాష్‌‍బ్యాక్‌లోకి వెళితే..?

ఈ ఫోన్ పై అనేక అనుమానాల వ్యక్తమవటంతో విచారణ జరపాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అరుణా శర్మకు టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ringing Bells claims to deliver Rs 251 smartphone from June 28. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot