రింగింగ్ బెల్స్ నుంచి రూ.251 ఫోన్, రూ.9,900 టీవీ (వచ్చేసాయ్)

వివాదాస్పద రింగింగ్ బెల్స్ స్మార్ట్‌పోన్ ఫ్రీడం 251 ఎట్టకేలకు మార్కెట్లో విడుదలయ్యింది. ఈ ఫోన్‌తో పాటు రూ.9,900 ధర రేంజ్‌లో హైడెఫినిషన్ టీవీతో పాటు మరికొన్ని ఫోన్‌లను మార్కెట్లో ద రింగింగ్ బెల్స్ లాంచ్ చేసింది.

రింగింగ్ బెల్స్ నుంచి రూ.251 ఫోన్, రూ.9,900 టీవీ (వచ్చేసాయ్)

జూలై 8 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్‌ల డెలివరీ ప్రారంభమవుతుందని కంపెనీ చెబుతోంది. మొదటి బ్యాచ్‌లో భాగంగా 5000 సెట్‌లను పంపిణి చేస్తామని కంపెనీ వెల్లడించింది. ఫ్రీడం 251తో పాటు రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వాటి వివరాలు Elegant, Eleganceలుగా ఉన్నాయి.

Read More : షాకింగ్: రూ.49,990 విలువ చేసే ఫోన్ రూ.15,490కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Elegant ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి...

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3.2 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.3,999.

Elegance ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి....

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3.2 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.4,999.

నాలుగు 4 ఫీచర్ ఫోన్‌లు కూడా

ఈ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు రింగింగ్ బెల్స్ సంస్థ లాంచ్ చేసిన 4 ఫీచర్ ఫోన్‌ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.  

4 ఫీచర్ ఫోన్‌ల వివరాలు ఇవే...

హిట్ (ధర రూ.699), కింగ్ (ధర రూ.899), బాస్ (ధర రూ.999), రాజా (ధర రూ.1099).

ఫ్రీడం ఎల్ఈడి టీవీ

రూ.9,900 ధర ట్యాగ్‌లో రింగింగ్ బెల్స్ లాంచ్ చేసిన ఫ్రీడం ఎల్ఈడి టీవీ ఆగస్టు 15 నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది కంపెనీ వెల్లడించింది.

రింగింగ్ బెల్స్ హిట్ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్స్...

రూ.699 ధర ట్యాగ్‌తో వస్తోన్న రింగింగ్ బెల్స్ హిట్ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్స్... 1.8 అంగులాల డిస్‌ప్లే, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమరా, 1250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రింగింగ్ బెల్స్ కింగ్ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్స్...

రూ.899 ధర ట్యాగ్‌తో వస్తోన్న రింగింగ్ బెల్స్ కింగ్ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్స్... 2.4 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రింగింగ్ బెల్స్ బాస్ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్స్...

రూ.999 ధర ట్యాగ్‌తో వస్తోన్న రింగింగ్ బెల్స్ బాస్ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్స్... 2.4 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రింగింగ్ బెల్స్ రాజా ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్స్...

రూ.1099 ధర ట్యాగ్‌తో వస్తోన్న రింగింగ్ బెల్స్ రాజా ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్స్... 2.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

180 రోజుల రీప్లేస్‌మెంట్ గ్యారంటీ

తాము విడుదల చేసిన అన్ని ఉత్పత్తుల పై 180 రోజుల రీప్లేస్‌మెంట్ గ్యారంటీ ఉంటుందని రింగింగ్ బెల్స్ వెల్లడించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ringing Bells Launches Cheapest Smartphone in India: Check Out Here!. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting