సిమ్ లేని స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్, సిమ్‌కి RIP చెప్పేయండిక !

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ని ప్రధానంగా వేధిస్తున్న సమస్య స్పేస్. ఈ స్పేస్ ని తగ్గించడానికి మొబైల్ కంపెనీలు రకరకాల ఆలోచనతో తమ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు సిమ్ లేని ఫోన్లు వస్తున్నాయి. ఇంతకీ సిమ్‌ కార్డు లేకుండా ఫోన్‌ పనిచేస్తుందా? అంటే, అది అసాధ్యమని చెప్పేస్తారు అందరూ. వేయి రూపాయల ఫోన్ అయినా లక్షరూపాయల ఫోన్ అయినా దానికి సిమ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఇప్పుడు దీనికి రాంరా చెప్పబోతోంది ఓ కంపెనీ రిప్ సిమ్ అంటూ ఓ వినూత్న టెక్నాలజీకి తెరలేపింది.

జియో ప్లాన్లు, రోజుకు 5జిబి, 3జిబి, 2జిబి,1.5జిబి,1జిబి డేటా ప్లాన్ల మొత్తం లిస్ట్ ఇదే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సిమ్ కార్డు లేని ఫోన్లను ..

ఆర్మ్‌ టెక్నాలజీ సంస్థ మార్కెట్లోకి సిమ్ కార్డు లేని ఫోన్లను తీసుకువస్తోంది. మొబైల్‌ ఫోన్లలో వాడే సిమ్‌కి బదులుగా ఐసిమ్‌ కార్డుని(ఇంటిగ్రేటెడ్‌ సిమ్‌ కార్డును) మొబైల్ లో పొందుపరచి సరికొత్త టెక్నాలజీతో ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఆర్మ్‌ సంస్థ ప్రయత్నిస్తోంది. అన్నీ కుదిరితే దీన్ని ఎండబ్ల్యూసీ 2018లో ప్రదర్శించబోతుందని రిపోర్టులు చెబుతున్నాయి.

ప్రాసెసర్‌తోనే చిప్‌సెట్‌లో..

ఈ సిమ్‌ కార్డు, ప్రాసెసర్‌తోనే చిప్‌సెట్‌లో ఇంటిగ్రేటెడ్‌ పార్ట్‌గా ఉండబోతుంది. ప్రాసెసర్‌ చిప్‌సెట్‌లోనే ఇంటిగ్రేటెడ్‌ అయ్యే ఐసిమ్‌ నెంబర్‌ను, ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత ఐసిమ్ నెంబర్ నెట్‌వర్క్ కంపెనీలకు చెబితే, వాళ్లు దానికి మొబైల్ నెంబర్‌ను అనుసంధానిస్తారు.

సిమ్‌ కార్డుకు కేటాయించే అదనపు స్థలం..

దీంతో సిమ్‌ కార్డుకు కేటాయించే అదనపు స్థలం మిగిలిపోతుంది. ఈ కొత్త ఐసిమ్‌ కార్డు చదరపు మిల్లిమీటర్ కంటే తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది.ఈ విధానం వల్ల ప్రస్తుతం ఉన్న సిమ్ కార్డ్ అవసరం ఉండదు. నెట్‌వర్క్ కంపెనీలకు కూడా సిమ్ కార్డ్ ఖర్చు తగ్గిపోతుంది.

సిమ్ కార్డ్ స్లాట్ కోసం ఉపయోగిస్తున్న స్థలంలో..

దీనికితోడు ప్రస్తుతం సిమ్ కార్డ్ స్లాట్ కోసం ఉపయోగిస్తున్న స్థలంలో మరికొన్ని ఆప్షన్స్‌తో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటానికి మొబైల్ తయారీ కంపెనీలకు అవకాశం కూడా ఉంటుందని తెలుస్తోంది.

మెరుగైన వాయిస్ క్లారిటీ ..

ఈ టెక్నాలజీతో మెరుగైన వాయిస్ క్లారిటీ ఉంటుందని ఆర్మ్ టెక్నాలజీ చెబుతోంది. స్మార్ట్‌ఫోన్ తయారీ దారులు, నెట్ వర్క్ సంస్థలు ఆమోదిస్తే, ఏడాది కాలంలోనే ఈ టెక్నాలజీ ఇండియాలోకి అందుబాటులోకి రానుందని సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
RIP SIM card: Next-gen iSIM to revolutionise the smartphone industry More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot