రిలయన్స్ జియో నుంచి రెండు కొత్త Lyf 4జీ ఫోన్‌లు

రిలయన్స్ జియో తన Lyf లైనప్ నుంచి రెండు సరికొత్త 4జీ ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఫ్లేమ్ 8, విండ్ 3 మోడల్స్‌లో విడుదలైన ఈ ఫోన్‌లను Flipkart ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. డ్యుయల్ సిమ్ స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4G VoLTE వంటి ఫీచర్లు ఈ రెండు ఫోన్‌లలో కామన్‌గా కనిపిస్తాయి. లైఫ్ ఫ్లేమ్ 8 స్మార్ట్‌ఫోన్ ధర రూ.4,199. లైఫ్ విండ్ 3 స్మార్ట్‌ఫోన్ ధర రూ.6,999.

రిలయన్స్ జియో నుంచి రెండు కొత్త Lyf 4జీ ఫోన్‌లు

Read More : షాకింగ్ : విమానం నుంచి కింద పడినా ఫోన్ పగల్లేదు

Lyf Flame 8 స్పెసిఫికేషన్స్ :

4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే, 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 (ఎమ్ఎస్ఎమ్8909) ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌకర్యం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,199.

రిలయన్స్ జియో నుంచి రెండు కొత్త Lyf 4జీ ఫోన్‌లు

Read More : ఒక్క ఫోన్.. 100 కోట్ల వ్యాపారం

Lyf Wind 3 స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 306 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4G VoLTE సపోర్ట్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, 2920 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.6,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Reliance Jio 4జీ సేవలు

Reliance Jio 4జీ సేవలు కమర్షియల్ మార్కెట్లోకి అడుగుపెట్టబుతోన్నాయి. ఉచిత వాయిస్ సర్వీసెస్ ఇంకా డేటాతో రిలియన్స్ జియో తన మొదటి 4జీ ప్లాన్‌ను ఆగస్టు 15ను కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకురాబోతోంది.

Freedom పేరుతో

Freedom పేరుతో రాబోతున్న ఈ ప్లాన్ ఇతర టెలికామ్ ఆపరేటర్లు వసూలు చేస్తున్న ధరల కన్నా 25శాతం తక్కువగా ఉంటాయని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. భారత దేశ స్వాంతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలియన్స్ జియో ఈ ఆఫర్‌తో ముందుకు రాబోతోంది.

లిమిటెడ్ ప్రివ్యూలోనే

ప్రస్తుతానికి రిలయన్స్ జియో 4జీ సర్వీసులు లిమిటెడ్ ప్రివ్యూలోనే అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ లైఫ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే యూజర్లు మాత్రమే జియో సిమ్ కార్డ్‌లను పొందగలుగుతున్నారు.

jio.comలో

రిలయన్స్ లైఫ్ బ్రాండ్ ఫోన్‌లను కొనాలనుకునే యూజర్లు ముందుగా రిలియన్స్ జియో అధికారిక వెబ్‌సైట్ jio.comలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతమైనట్లయితే జియో సర్వీసు నుంచి ఓ కోడ్ మీ ఈమెయిల్‌కు అందుతుంది.

రిలయన్స్ లైఫ్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా...

ఈ కోడ్ ఆధారంగా మీకు జియో సిమ్‌తో పాటు లైఫ్ స్మార్ట్‌ఫోన్‌ను అందించటం జరుగుతంది. రిలయన్స్ లైఫ్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతానికి రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ అలానే డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌లలో లభ్యమవుతున్నాయి.

ఒక్కో యూజర్‌కు ...

ఒక్కో యూజర్‌కు రిలయన్స్ జియో జారీ చేసే కోడ్ ఇతరులకు బదిలీ చేయలేని విధంగా ఉంటుంది. ఈ కోడ్‌ను పొందే క్రమంలో యూజర్ తన పర్సనల్ ఈమెయిల్ ఐడీతో పాటు అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. నిర్ధేశిత expiry dateతో వచ్చే ఈ కోడ్‌ ఆ గడువులోపే పనిచేస్తుంది.

రూ.2,999 ధర ట్యాగ్ నుంచి

Lyf బ్రాండ్ పేరిట రిలయన్స్ అందిస్తోన్న 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లు రూ.2,999 ధర ట్యాగ్ నుంచి లభ్యమవుతున్నాయి.

3 నెలల పాటు 4జీ సేవలు ఉచితం

ప్రతి ఫోన్ కొనుగోలు పై 3 నెలల రిలయన్స్ జియో ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉచితంగా పొందే అవకాశాన్ని రిలయన్స్ కల్పిస్తోంది.

డౌన్‌లోడ్ స్పీడ్ ఎంతంటే..?

రిలయన్స్ జియో 4జీ సిమ్ అందించే డౌన్‌లోడ్ స్పీడ్ నెట్‌వర్క్ స్థాయిని బట్టి కనిష్టంగా 8 ఎంబీపీఎస్ నుంచి గరిష్టంగా 18 ఎంబీపీఎస్ వరకు ఉంది

ఇతర నెట్‌వర్క్ ఆపరేటర్లు

ఇదే సమయంలో మార్కెట్లోని ఇతర నెట్‌వర్క్ ఆపరేటర్లు ఆఫర్ చేస్తోన్న 4జీ నెట్ వర్క్ స్పీడ్స్ 6 ఎంబీపీఎస్ నుంచి 10 ఎంబీపీఎస్ వరకు డౌన్‌లోడ్ స్పీడ్‌లను కలిగి ఉంటున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
RJio Launches Lyf Flame 8 & Wind 3 Smartphones with 4G on Flipkart; Price Starts at Rs 4,199. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot