Home
Mobile

మోటరోలా '8 మెగా ఫిక్సల్' మొబైల్

By Super
Motorola XT615


నాణ్యమైన, మన్నిక కలిగిన మొబైల్ ఉత్పత్తులకు మోటరోలా పెట్టింది పేరు. మోటరోలా ఇటీవలే తైవాన్ మొబైల్ మార్కెట్లోకి సరిక్రొత్త స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసింది. దాని పేరు 'మోటరోలా ఎక్స్‌టి 615'. మొబైల్ చుట్టుకొలతలు 117.7 mm x 60.5 mm x 9.85 mm. మొబైల్ బరువు 123.6 g. తక్కువ మందం కలిగి రిచ్‌నెస్‌ని కలగజేసేటటువంటి ఈ స్మార్ట్ ఫోన్ అందం వర్ణించ లేనిది. మార్కెట్లో 'మోటరోలా ఎక్స్‌టి 615' మొబైల్ సిల్వర్ వైట్, డార్క్ గ్రే కలర్‌‌లో లభ్యమవుతుంది

స్క్రీన్ డిస్ ప్లే 4 ఇంచ్‌లు. మొబైల్ వెనుక భాగాన 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. లైటింగ్ లేని వాతావరణంలో కూడా ఇందులో ఉన్న ఎల్‌ఈడి ప్లాష్ సహాయంతో ఫోటోలను తీయవచ్చు. ఇక మొబైల్ ముందు భాగాన ఉన్న విజిఎ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొని రావచ్చు. మొబైల్ ఫెర్పామెన్స్ అధ్బుతంగా ఉండేందుకు గాను 800MHzతో పాటు క్వాలికామ్ MSM7227A-0 ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

సిస్టమ్ మెమరీ కెపాసిటీ 512 MB. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 1జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో‌ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై - పైలను సపోర్ట్ చేస్తుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో Lithium ion 1390mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో 'మోటరోలా ఎక్స్‌టి 615' ధర సుమారుగా రూ 20,000 వరకు ఉండవచ్చునని మొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

'మోటరోలా ఎక్స్‌టి 615' మొబైల్ ప్రత్యేకతలు:

* నెట్ వర్క్ : WCDMA (900/2100) and GSM (850/900/1800/1900), HSDPA 7.2M/HSUPA 5.76Mbps

* ఆపరేటింగ్ సిస్టమ్: Google Android Gingerbread 2.3, Moto Switch UI 2.0

* సిపియు మెమరీ: Qualcomm MSM7227A-0

* ప్రాససెర్ పవర్: 800 MHz

* ఇంటర్నల్ మెమరీ: 1 GB ROM with 512MB RAM

* డిస్ ప్లే స్క్రీన్ సైజు: 4.0 inches

* డిస్ ప్లే రిజల్యూషన్: 480 x 854 Pixels

* డిస్ ప్లే టైపు: FWVGA

* కెమెరా సైజు: 8.0 Mega Pixels

* కెమెరా సపోర్ట్: LED flash

* సెకండరీ కెమెరా: VGA

* 3.5mm audio connector Jack

* విస్తరించుకునే మెమరీ: supports up to 32GB

* ఇంటర్నెట్ కనెక్టివిటీ: Wi-Fi Direct

* డేటా ట్రాన్ఫర్: USB 2.0 HS, Blue Tooth 3.0 EDR/A2DP, 802.11 b/g/n, MicroSD card slot

* వీడియో ఫార్మెట్ సపోర్ట్: MPEG4, rmvb, Divx, H.263, H.264

* ఆడియో ఫార్మెట్: Audio AMR, AAC, AAC+, eAAC+, MIDI, MP3, WAV

* బ్యాటరీ : Li-ion 1390 mAh

* టాక్ టైమ్: 300 mins

* స్టాండ్ బై టైమ్: 110 hours

* చుట్టుకొలతలు: 117.7 x 60.5 x 9.85 mm

* బరువు: 123.6 grams

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X