రూ.2,700కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌: గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ ష్మిత్

Posted By:

రూ.2,700కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌: గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్
భారత పర్యటనలో భాగంగా గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ ష్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొబైల్ వెబ్ బ్రౌజింగ్‌ను అమితంగా ఇష్టపడుతున్న భారతీయులకు వెబ్ బ్రౌజర్ ఇంకా వెబ్- క్లయింట్ అప్లికేషన్‌లతో కూడిన ఎంట్రీలెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,700కే అందుబాటులోకి వచ్చే అవకాశాలు త్వరలోనే ఉన్నాయని బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ష్మిత్ అభిప్రాయపడ్డారు.

చవక ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేసే కంపెనీలను గూగుల్ ఎప్పుడు ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇండియా వంటి మార్కెట్లో వెబ్ ఆధారిత ఫీచర్లతో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను చవక ధరల్లో అందుబాటులోకి తీసుకురావటం వల్ల మొబైల్ ఆధారిత ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగుతుందని అన్నారు.

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హై లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్ తన హవాను కొనసాగిస్తోంది. దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఈ సిరీస్ నుంచి కొత్త కొత్త హ్యాండ్‌సెట్‌లు పరిచయమవుతుండటంతో బ్రాండ్ విలువు రోజురోజుకు రెట్టింపవుతోంది.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot