12GB RAM, 3x 50MP కెమెరాలు, 120Hz డిస్‌ప్లే.. Oppo Find X8పై రూ.20,500 భారీ డిస్కౌంట్..
Oppo Find X8 Discount: మంచి ఫీచర్లతో ఒక అదిరిపోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎప్పటి నుంచో చూస్తున్నారా? అయితే, ఇదే మీకు సరైన సమయం. ఒప్పో కంపెనీకి చెందిన ఒప్పో ఫైండ్ X8 (Oppo Find X8) ఫోన్ ఇప్పుడు విజయ్ సేల్స్‌లో ఏకంగా రూ.20,500 భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఇది ఒప్పో ఫైండ్ X8 ప్రోతో పాటు లాంచ్ అయింది.
శక్తివంతమైన ప్రాసెసర్, మెరుగైన కెమెరాలు, కళ్లకు కట్టేలా ఉండే వైబ్రంట్ డిస్‌ప్లేతో వచ్చే ఈ ప్రీమియం ఫోన్, ఇప్పుడు గతంలో కంటే చాలా తక్కువ ధరకే మీ సొంతం కాబోతోంది. మరి ఈ డీల్‌ను ఎలా పట్టేయాలో, అసలు ఈ ఫైండ్ X8 ఎందుకు అంత ప్రత్యేకమో ఇక్కడ చూసేయండి.

* విజయ్ సేల్స్‌లో ఒప్పో ఫైండ్ X8 ధర, డిస్కౌంట్ వివరాలు
ఒప్పో ఫైండ్ X8 అసలు ధర రూ.69,999. కానీ ఇప్పుడు విజయ్ సేల్స్‌లో ఏకంగా రూ.17,000 డైరెక్ట్ డిస్కౌంట్ ఇచ్చేశారు. దాంతో దీని ధర రూ.52,999కి పడిపోయింది. ఆగండి, ఆఫర్ ఇక్కడితో అయిపోలేదు. మీరు HDFC బ్యాంక్ కార్డులతో పాటు కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు వాడితే, అదనంగా మరో రూ.3,500 ఆదా చేసుకోవచ్చు.
అంటే, ఫైనల్‌గా ఈ ఫోన్ ధర రూ. 50,000 లోపే వచ్చేస్తుంది. అంతేకాదు, EMI ప్లాన్స్ కూడా ఉన్నాయి. 24 నెలల కాలానికి నెలకు కేవలం రూ. 2,570 నుండే EMI మొదలవుతుంది. మీరు వాడే బ్యాంకును బట్టి నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.
మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే దాన్ని ఎక్స్ఛేంజ్ చేసి ఇంకాస్త ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్ మోడల్, కండిషన్‌ను బట్టి ఎక్స్ఛేంజ్ విలువ మారుతుంది. ఈ బంపరాఫర్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది. ఈ ధరలో ఇది నిజంగా పైసా వసూల్ డీల్ అనే చెప్పాలి.
* ఒప్పో ఫైండ్ X8 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఒప్పో ఫైండ్ X8 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 (MediaTek Dimensity 9400) ప్రాసెసర్‌తో వస్తుంది. దీనివల్ల మల్టీటాస్కింగ్ చేయొచ్చు, హై-ఎండ్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇందులోని 6.59-అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ (Dolby Vision), HDR10+ సపోర్ట్‌తో వస్తుంది.
* ఫొటోగ్రఫీ ప్రియులకు బెస్ట్
ఈ ఫోన్‌లో హాసెల్‌బ్లాడ్ (Hasselblad) టెక్నాలజీతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం, అదిరిపోయే ఫోటోలు, వీడియోల కోసం ముందు వైపు 32MP కెమెరా ఇచ్చారు.
* బ్యాటరీ లైఫ్ గురించి చింతే వద్దు
ఇందులో 5,630mAh భారీ బ్యాటరీ ఉంది. అంతేకాదు, 80W సూపర్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, ఇంకా 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆధారిత కలర్‌ఓఎస్ 15 (ColorOS 15)పై పనిచేస్తుంది.
* ఈ డీల్ ఎందుకు అంత గొప్పది..
ఒప్పో ఫైండ్ X8 ఒక ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇచ్చే పెర్ఫార్మెన్స్‌ను ఇప్పుడు భారీ తగ్గింపు ధరలో అందిస్తోంది. అందుకే ఇది ఒక మంచి కొనుగోలు. రూ.50,000లోపు ధరలో ఇది బెస్ట్ వ్యాల్యూను అందిస్తుంది. మీరు కూడా తక్కువ ధరలో ఒక ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, విజయ్ సేల్స్‌లో లభిస్తున్న ఈ కొద్దికాలపు ఆఫర్‌ను అస్సలు మిస్ అవ్వకండి.


Click it and Unblock the Notifications








