Home
Mobile

గెలాక్సీ ఎస్9 సీరిస్ ఫోన్లపై భారీ ఆఫర్లు, రూ.9 వేల దాకా..

దక్షిణ కొరియా మొబైల్‌ దిగ్గజం శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది.

By Hazarath Aiah

దక్షిణ కొరియా మొబైల్‌ దిగ్గజం శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. గెలాక్సీ ఎస్‌9, ఎస్‌ 9 ప్లస్‌ డివైస్‌లపై ప్రైవేట్ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌ కార్డు, లేదా పేటీఎం మాల్‌ ద్వారా చేసిన కొనుగోళ్లపై రూ .9000 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ చేస్తోంది. జూన్ 30వ తేదీవరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు అదనంగా మరో 9వేల రూపాయల ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌, వన్‌ టైం స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ కూడా ఉంది. అలాగే నోకాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ కూడా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు శాంసంగ్‌ టీజర్‌ను రిలీజ్‌ చేసింది. ఈ రెండు ఫోన్లను ఫిబ్రవరి నెలలో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.

గెలాక్సీ ఎస్‌9 ధర

గెలాక్సీ ఎస్‌9 ధర

ఇండియన్‌ మార్కెట్‌లో గెలాక్సీ ఎస్‌9 64 జీబీ వేరియంట్‌ ధర, రూ. 57,900, 128జీబీ వేరియంట్‌ ధర రూ. 61,900, 256జీబీ వేరియంట్‌ ధర రూ .65,900 గా ఉంది.

ఎస్‌ 9 ప్లస్‌ ధర

ఎస్‌ 9 ప్లస్‌ ధర

ఎస్‌ 9 ప్లస్‌ స్మార్ట్ ఫోన్ 64 జీబీ వేరియంట్‌ ధర 64,900 రూపాయలు, 128 జీబీ వేరియంట్‌ ధర 68,900 రూపాయలు , 256 జీబీ వేరియంట్‌ ధర 72,900 రూపాయలు లభిస్తుంది.

9వేల భారీ తగ్గింపు

9వేల భారీ తగ్గింపు

వీటిపై 9వేల భారీ తగ్గింపు లభ్యం కానుంది. గడువు తేదీ ముగిసిన 90 రోజుల తరువాత కస్టమర్ల ఖాతాలోకి ఈ డిస్కౌంట్‌ను క్రెడిట్‌ చేస్తుంది.

180 రోజుల లోపు

180 రోజుల లోపు

ఫోన్లను కొనుగోలు చేసిన బిల్లును వినియోగదారులు 180 రోజుల లోపు కంపెనీకి అందించాల్సి ఉంటుంది.

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు :

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు :

5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌ 4జీబీర్యామ్‌ 64జీబీస్టోరేజ్‌ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ,

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు :

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు :

6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌ 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఎయిర్‌టెల్ ఆఫర్లు

ఎయిర్‌టెల్ ఆఫర్లు

శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. అలాగే రూ.9900 డౌన్ పేమెంట్ చెల్లిస్తే గెలాక్సీ ఎస్9 ఫోన్‌ను ఎయిర్‌టెల్ కస్టమర్లకు అందిస్తుంది. వారు నెలకు తమకు లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్, ఈఎంఐతో కలిపి రూ.2499లను 24 నెలల పాటు చెల్లించాలి. ఈ కాలంలో వారికి 2టీబీ మొబైల్ డేటా లభిస్తుంది.

రూ.499, రూ.799 ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడితే..

రూ.499, రూ.799 ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడితే..

శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లలో ఎయిర్‌టెల్‌కు చెందిన రూ.499, రూ.799 ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడితే వారికి డబుల్ మొబైల్ డేటా లభిస్తుంది. ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ ఉచిత మెంబర్‌షిప్, హ్యాండ్ సెట్ ప్రొటెక్షన్ లభిస్తాయి.

జియో

జియో

జియోలో అయితే రూ.4999 ప్లాన్ ద్వారా 1టీబీ డేటా వస్తుంది. వొడాఫోన్‌లో అయితే రూ.999 ఆ పైన విలువ గల రెడ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడితే ఏడాది పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

వొడాఫోన్

వొడాఫోన్

వొడాఫోన్ ప్రీపెయిడ్‌లో రూ.199 ప్లాన్ రీచార్జి చేసుకుంటే రోజుకు 1.4 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ నెల రోజుల పాటు వస్తాయి. అలాగే ప్రతినెలా మరో 10 జీబీ డేటాను 10 నెలల పాటు అదనంగా ఇస్తారు.

Best Mobiles in India

English summary
ICICI Bank gives Rs 9000 cashback on Galaxy S9, Galaxy S9+; Know price, specs, features and more offers More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X