Realme GT Neo 3T మొబైల్‌పై భారీ ఆఫ‌ర్‌.. రూ.9 వేల త‌గ్గింపు!

|

దేశంలో పండ‌గ సీజ‌న్ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ ప్లాట్‌ఫాంలు ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్‌లు భారీ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నాయి. అనేక బ్రాండ్‌లు త‌మ ఉత్ప‌త్తుల‌పై అద్భుత‌మైన త‌గ్గింపుల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. Realme కూడా తమ పరికరాలపై డిస్కౌంట్‌లను అందించడానికి రిటైలర్‌లతో చేతులు క‌లిపింది.

 
Realme GT Neo 3T మొబైల్‌పై భారీ ఆఫ‌ర్‌.. రూ.9 వేల త‌గ్గింపు!

ఉదాహరణకు, Realme ఫెస్టివ్ డేస్ సేల్‌లో భాగంగా Realme GT Neo 3Tని రూ.9,000 తగ్గింపు ధ‌ర‌కు అందిస్తోంది. ఈ ఆఫ‌ర్‌పై ఆస‌క్తి గ‌ల వినియోగ‌దారులు అక్టోబర్ 16 వరకు Flipkart మరియు Realme India వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ను తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

గ్రేట్ డీల్:

గ్రేట్ డీల్:

Realme ఫెస్టివ్ డేస్ సేల్ లో భాగంగా సరసమైన C సిరీస్, నార్జో సిరీస్ మరియు ప్రీమియం GT శ్రేణితో సహా దాని అన్ని ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తోంది. అదనంగా, ఇయర్‌బడ్స్, స్పీకర్లు మరియు ఇతర ఉపకరణాలు వంటి Realme AIoT పరికరాలు కూడా తగ్గింపును పొందుతాయి. ముఖ్యంగా, Realme GT Neo 3T పై విక్రయ సమయంలో రూ.9,000 తగ్గింపు అందిస్తోంది. ఇది ప్ర‌స్తుతం అత్యుత్తమ డీల్‌లలో ఒకటిగా ఉంది. మీరు కూడా దీనిపై ఓ లుక్కేయండి.

మూడు వేరియంట్ల‌పై త‌గ్గింపు:

మూడు వేరియంట్ల‌పై త‌గ్గింపు:

ప్రస్తుతం, Realme GT నియో 3T బేస్ మోడ‌ల్ 6GB ర్యామ్ ప్రారంభ ధర రూ.29,999 గా ఉంది. మరియు 8GB ర్యామ్‌| 128GB, 256GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ల ధ‌ర‌లు వ‌రుస‌గా రూ.31,999 మరియు రూ.33,999 ఉన్నాయి. అయితే, Realme ఫెస్టివ్ డేస్ సేల్‌లో భాగంగా అన్ని మోడళ్లపై రూ.9,000 తగ్గింపు అందిస్తున్నారు. దీంతో ఎంట్రీ వేరియంట్ మోడ‌ల్‌ను రూ.20,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. మిగిలిన రెండు మోడల్స్ ను ఇప్పుడు వరుసగా రూ.22,999 మరియు రూ.24,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. తాజా ఆఫ‌ర్‌ Realme GT Neo 3Tని రూ.25వేల‌ లోపు ఫోన్ కోసం చూసే వారికి ఉత్తమ ఆప్ష‌న్ గా చేస్తుంది.

ఎక్స్‌చేంజ్ ఆఫ‌ర్ కూడా:
 

ఎక్స్‌చేంజ్ ఆఫ‌ర్ కూడా:

అదనంగా, కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో మార్పిడి చేసుకుంటే అదనపు తగ్గింపును పొందవచ్చు. కొత్త Realme GT Neo 3T కోసం బ్యాంక్ ఆఫర్‌లు మరియు క్యాష్‌బ్యాక్ డీల్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, దీని వలన ధర మరింత తగ్గుతుంది. డిస్కౌంట్ సేల్ ఇప్పుడు లైవ్‌లో ఉంది మరియు అక్టోబర్ 16 వరకు లేదా స్టాక్‌లు ఉండే వరకు కొనుగోలు చేయవచ్చు.

Realme GT నియో 3T ఫీచర్లు:

Realme GT నియో 3T ఫీచర్లు:

Realme GT Neo 3T 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్‌తో E4 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే HDR10+కి మద్దతు ఇస్తుంది. Realme GT నియో 3T 5G ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని చిప్‌సెట్ గరిష్టంగా 8GB RAM మరియు 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో జత చేయబడింది. ఇది realmeUI కస్టమ్ స్కిన్‌తో Android 12 OS ఆధారంగా ర‌న్ అవుతుంది.

కెమెరాల విష‌యానికొస్తే... Realme GT Neo 3T మొబైల్ 64MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP మాక్రో షూటర్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అదనంగా, సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 16MP క్వాలిటీ గ‌ల ఫ్రంట్ కెమెరా ఉంది.

ఇక బ్యాట‌రీ విష‌యానికొస్తే.. Realme GT Neo 3T మొబైల్ 80W సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో జత చేయబడిన 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. వినియోగదారులు కేవలం 12 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌ను పొందవచ్చని Realme పేర్కొంది. అదనంగా, స్మార్ట్‌ఫోన్ 8-లేయర్ హీట్ డిస్సిపేషన్ టెక్నాలజీతో స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ ప్లస్‌తో వస్తుంది. ఇది USB టైప్-C పోర్ట్, బ్లూటూత్, Wi-Fi, GPS మొదలైన సాధారణ కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Rs.9000 Huge discount on Realme GT Neo 3T mobile in festive sale.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X