త్వరలో డెల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ..

Posted By: Staff

త్వరలో డెల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ..

కంప్యూటర్లను తయారు చేసేటటువంటి డెల్ త్వరలో ఇండియన్ మొబైల్ మార్కట్లోకి కొత్త స్మార్ట్ పోన్లను ప్రవేశపెట్టనుంది. రాబోయే నెలల్లో డిమాండ్‌ ను బట్టి మరిన్ని టెలిఫోన్‌ పరికరాలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. మొబైల్‌ ఫోన్‌ రంగం దేశంలో ప్రోత్సాహకరంగా ఉందని .. డెల్ కంపెనీకి చెందిన ఉత్పత్తలకు కూడా మంచి స్పందన వస్తోందని డెల్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, జీఎం (కన్సుమర్‌, ఎస్‌ఎంబీ) మహేష్‌ భల్లా చెప్పారు. దీనిని కస్టమర్స్ నుండి క్యాష్ చేసుకునేందుకు గాను డెల్‌ ఇండియాలో ఐదు రకాల స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు మార్కెట్‌ చేస్తోందని ఆయన తెలిపారు.

మొబైల్‌ డివిజన్‌లో డెల్‌ స్ట్రీక్‌5, ఎక్స్‌సీడీ35, డెల్‌ వెన్యూ, డెల్‌ వెన్యు ప్రో అందుబాటులో ఉన్నాయని త్వరలోనే కొత్తరకం హ్యాండ్‌సెట్‌ను విడుదల చేస్తామని వాటిని మైక్రో సాఫ్ట్‌ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌, అండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా పని చేస్తాయని ఆయన చెప్పారు. ఈ సందర్బంలో జర్నలిస్టులు చౌకరకం ఫోన్లను అందుబాటు లోకి తెస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా లేదని చెప్పారు.

అందుకు కారణం డెల్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడమేనని అన్నారు. చౌకరకం ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టి కస్టమర్స్‌ని ఎట్రాక్ట్ చేయవచ్చు ఏమోగానీ, వారి మన్ననలను పొందడం మాత్రం చాలా కష్టం అని అన్నారు. అందుకే తమ స్మార్ట్‌ఫోన్లు రూ.10,000 లకు మార్కెట్లో లభ్యమవుతున్నాయని అన్నారు. చౌకరకం ఫోన్లను అందించే కంటే కూడా మార్కెట్లోకి అత్యుత్తమనైన నాణ్యమైన మొబైల్ పోన్లనే తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting