స్మార్ట్‌ఫోన్ ధరలు భగ్గుమనబోతున్నాయా..?

|

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు పతనమవుతుండటంతో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ ప్రభావం ఇదే విధంగా కొనసాగితే పండుగుల సీజన్‌లో లాంచ్ చేయబోయే స్మార్ట్‌ఫోన్‌ల పై 7% వరకు ధరలను పెంచాల్సి వస్తుందని కంపెనీలు ఆందోళణ వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఫీచర్ ఫోన్స్ అలానే లో-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఈ ధరల పెంపు ప్రభావం ఎక్కువుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం ప్రస్తుత విలువ రూ.71.96 వద్ద కొనసాగుతోంది.

పండుగ సేల్ పై నెగిటివ్ ప్రభావం..
 

పండుగ సేల్ పై నెగిటివ్ ప్రభావం..

డీజిల్ ధరలు పెంపు, రూపాయి పతనం వంటి అంశాలు పండుగ సీజన్‌లో నిర్వహించే స్మార్ట్‌ఫోన్‌ల సేల్ పై నెగిటివ్ ప్రభావం చూపే అవకాశముందని పానాసోనిక్ ఇండియా మొబిలిటీ హెడ్ పంకజ్ రాణా అభిప్రాయపడ్డపారు. ఈ నష్టాన్ని కవర్ చేసే క్రమంలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు డిస్కౌంట్లను గుప్పించే అవకాశముందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితులు పై కామియో ఇండియా సీఈఓ సంజయ్ కలిరోనా స్పందిస్తూ రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు బ్రాండ్స్ ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నాయని అన్నారు.

పరిస్థితలను దగ్గరగా సమీక్షిస్తోన్న పెద్ద బ్రాండ్‌లు..

పరిస్థితలను దగ్గరగా సమీక్షిస్తోన్న పెద్ద బ్రాండ్‌లు..

పానాసోనిక్, లావా వంటి బ్రాండ్‌లు ఇప్పటకే తమ ఫోన్‌లకు సంబంధించిన ధరలను అడ్జస్ట్ చేయటం జరిగింది. షావోమి, సామ్‌సంగ్ వంటి పెద్ద బ్రాండ్‌లు ధరలు విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి మార్పులను ప్రకటించలేదు. ఈ రెండు బ్రాండ్స్ పరిస్థితలను చాలా దగ్గరగా సమీక్షిస్తున్నాయి. ఇదే బాటలో హెచ్‌ఎండి గ్లోబల్ ఇంకా వివోలు రూపాయి మారకం విలువను మానిటర్ చేస్తున్నాయి.

రూ.10,000లోపు ఫోన్‌ల పై పెనుభారం..

రూ.10,000లోపు ఫోన్‌ల పై పెనుభారం..

రూపాయి విలువ రోజురోజుక క్షీణిస్తోన్న నేపథ్యంలో రూ.10,000 ఇంకా రూ,20,000 బడ్జెట్ రేంజ్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోన్న బ్రాండ్‌లు ధర వ్యూహాలను మరోసారి సమీక్షించుకోవల్సి ఉంటుందని సీఎమ్ఆర్ విశ్లేషకుడు ప్రభురామ్ తెలిపారు. ఇక ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఈ విభాగంలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని ఆయన తెలిపారు.

క్యాచ్-22 పరిస్థితిలో చిన్నచిన్న బ్రాండ్‌లు..
 

క్యాచ్-22 పరిస్థితిలో చిన్నచిన్న బ్రాండ్‌లు..

ప్రస్తుతం నెలకున్న పరిస్థితుల నేపథ్యంలో చిన్నచిన్న బ్రాండ్‌లు క్యాచ్-22 పరిస్థితిలో చిక్కుకున్నాయని, వీరు తమ ఫోన్‌లకు సంబంధించి ధరలు పెంచాల్సి ఉన్నప్పటికి కాంపిటీషన్ కారణంగా అలా చేయలేరని తెలిపారు. రూపాయి మారకం విలువ ప్రపంచ మార్కెట్ల ముందు క్షీణిస్తోన్న నేపథ్యంలో ప్రతి ఒక్క స్మార్ట్‌ఫోన్ కూడా 8 నుంచి 10 శాతం వరకు అదనపు ఖర్చులను భరించాల్సి ఉంటుందని కామియో ఇండియా సీఈఓ సంజయ్ కలిరోనా తెలిపారు.

ధరల పెంచేం సాహసం చేయటం లేదు.

ధరల పెంచేం సాహసం చేయటం లేదు.

అయితే, ప్రస్తుతం నెలుకున్న పోటీ మార్కెట్ నేపథ్యంలో ఏ ఒక్కరూ కూడా స్మార్ట్‌ఫోన్ ధరలను పెంచేందుకు సాహసించటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ధరలు పెంపుకు సంబంధించి సామ్‌సంగ్, షావోమి వంటి బ్రాండ్‌లు ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే తాము కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునేందుకు వీలుంటందని ఆయన తెలిపారు.

ధైర్యం చేసిన పానాసోనిక్..

ధైర్యం చేసిన పానాసోనిక్..

తమ బ్రాండ్ నుంచి భవిష్యత్‌లో లాంచ్ చేయబోయే స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి పానాసోనిక్ ఇండియా మొబిలిటీ హెడ్ పంకజ్ రానా కీలక ప్రకటన చేసారు. తాము సెప్టంబర్ 20 నుంచి అక్టోబర్ 10లోపు 3 నుంచి 4 కొత్త ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేయబోతున్నామని వీటి ధరలను ప్రస్తుత రుపాయి మారకాన్ని బట్టి ఫైనలైజ్ చేసినట్లు ఆయన తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Rupee fall to spoil festive season for mobile brands.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X