చివరకు చిక్కెను 'యాపిల్ గేమ్స్'

Posted By: Super

చివరకు చిక్కెను 'యాపిల్ గేమ్స్'

యాపిల్ మొబైల్స్‌కి ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానం. స్టీవ్ జాబ్స్ మరణం తర్వాత యాపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన యాపిల్ ఐపోన్ 4ఎస్ మార్కెట్లో అనతి కాలంలో ఎంతో సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ కంపెనీ 'ఐపోన్ 4ఎస్' ని విడుదల చేసింది. దక్షణ కొరియాలో యాపిల్ తన ఐఫోన్ 4ఎస్‌ని విడుదల చేసిన సంగతి విదితమే.

మొదట్లో దక్షణ కోరియాలో యాపిల్ కంపెనీకి చెందిన స్టోర్స్‌లలో ఐఫోన్ 4ఎస్ గేమ్స్‌ని నిషేదించడం జరిగింది. ఏమైందో ఏమోగానీ ఈరోజు ఉదయాన్నే దక్షణ కోరియాలో యాపిల్ గేమ్స్‌పై విధించిన నిషేదాన్ని ఎత్తివేస్తున్నామని ఉత్తర్వులు వెలువడ్డాయి. దాంతో దక్షణ కొరియాలో ఉన్న యాపిల్ అభిమానులు ఒక్కసారిగా ఆనందోత్సాహాంలో మునిగి తేలుతున్నారు.

గత రెండు సంవత్సరాలుగా కొరియా గేమ్ రేటింగ్స్ బోర్డు దేశంలో ఉన్న మొబైల్ ఫోన్స్‌లలో ఉన్న గేమింగ్ సర్వీస్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. దాంతో కొరియన్స్ అమెరికాకు చెందిన ఐట్యూన్స్ ఎకౌంట్స్‌ని ఓపెన్ చేసుకొని గేమ్స్‌ని ఆడుకొవడం జరుగుతుంది. కానీ ఈరోజు నుండి కొరియన్ యాపిల్ యూజర్స్‌కు కొంత ఊరట లభించింది. దాంతో కొరియన్ ఆధారిత యాపిల్ స్టోర్ ఎకౌంట్ నుండే వారి గేమ్స్‌ని ఆడుకొవచ్చు.

కొరియా యాపిల్ స్టోర్‌లో ప్రస్తుతానికి తక్కువ గేమ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, కొరియా ప్రభుత్వం నిబంధలను సడలించడంతో కొత్త కొత్త గేమ్స్‌ని త్వరలో అందుబాటులోకి తేనున్నామని యాపిల్ ప్రతినిధులు తెలియజేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot