'స్పైస్' డ్యూయల్ సిమ్ ఫోన్ కేక..

By Super
|
Spice M 5455 Flo


కొద్ది కాలం తర్వాత స్పైస్ మొబైల్స్ మరలా ఇండియన్ మార్కెట్లోకి డ్యూయల్ సిమ్ ఫీచర్స్ కలిగిన మొబైల్ ఫోన్‌ని విడుదల చేసింది. ఆ మొబైల్ పేరు 'స్పైస్ ఎమ్ 5455 ఫ్లో'. 6cm QVGA టచ్ స్క్రీన్ డిస్ ప్లే దీని సొంతం. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే కాల్ చేయడం, కాల్ రిజక్ట్ చేయడానికి సంబంధించి రెండు బటన్స్‌ని కీప్యాడ్ క్రింద ప్రత్యేకంగా అమర్చడం జరిగింది. చూసేందుకు గాను ముచ్చగా ఉన్న ఈ 'స్పైస్ ఎమ్ 5455 ఫ్లో' వెనుక భాగాన ఉన్న 1.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలతో పాటు, వీడియోని రికార్డ్ కూడా చేయవచ్చు.

 

'స్పైస్ ఎమ్ 5455 ఫ్లో' మొబైల్‌లో ఆడియో, వీడియో ప్లేయర్స్‌ని ఎంటర్టెన్మెంట్ కొసం అందుబాటులో ఉంచడం జరిగింది. మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను ఈ ప్లేయర్స్ సపొర్ట్ చేస్తాయి. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో‌ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 8జిబి వరకు విస్తరించుకొవచ్చు.

 

కనెక్టివిటీ ఫీచర్ అయిన బ్లూటూత్ ఇందులో ప్రత్యేకం. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 950 mAh Li-ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. బ్యాటరీ టాక్ టైమ్ 4 గంటలు, బ్యాటరీ స్టాండ్ బై టైమ్ 230 గంటలు. ఇక ఇండియన్ మొబైల్ మార్కెట్లో 'స్పైస్ ఎమ్ 5455 ఫ్లో' మొబైల్‌ ధర సుమారుగా రూ 2,400 వరకు ఉండవచ్చునని అంచనా. ఎఫ్‌‌ఎమ్ రేడియో ప్రత్యేకం.

'స్పైస్ ఎమ్ 5455 ఫ్లో' మొబైల్‌ ప్రత్యేకతలు:

మెమరీ:

* ఇంటర్నల్ మెమరీ: 110K

* విస్తరించే మెమరీ: Up to 8GB

కనెక్టివిటీ:

* జిబిఆర్‌ఎస్: Yes

* బ్లూటూత్: v2.0

* పోర్ట్: USB

మ్యూజిక్ ప్లేయర్:

* వీడియో ప్లేయర్: Yes

* మ్యూజిక్ ప్లేయర్: MP3 Player

* ఎఫ్‌ఎమ్ రేడియో: Radio with Scheduled FM Recording

బ్యాటరీ:

* బ్యాటరీ: 950 mAH Li-ion Battery

* స్టాండ్ బై టైమ్: Upto 230 Hours

* టాక్ టైమ్: Upto 4 Hours

చుట్టుకొలతలు:

* చుట్టుకొలతలు: 113*51.6*13.7mm

* బరువు: 86 g

* కలర్: Green

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X