మనోళ్ల దెబ్బకు తుస్సుమన్న చైనా ఫోన్లు, కొనేవారే కరువు !

|

చైనా మొబైల్ కంపెనీలు భారతీయుల దెబ్బకు విలవిలలాడుతున్నాయి. చైనా మొబైల్ కంపెనీలైన ఒప్పో, వివో స్మార్ట్ ఫోన్ సేల్స్ దేశంలో గణనీయంగా పడిపోయాయి. ఇండియా మొబైల్ మార్కెట్లో దూసుకుపోవాలనుకున్న ఈ కంపెనీల విక్రయాలు గత నెలలో ఘోరంగా పడిపోయాయి. ఏకంగా 30 శాతం దిగజారిపోవడం, ఈ నెల కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో ఈ రెండు కంపెనీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.

 

విమానం నుంచి పడినా చెక్కు చెదరని ఫోన్, షాకిచ్చిన శాంసంగ్ S5విమానం నుంచి పడినా చెక్కు చెదరని ఫోన్, షాకిచ్చిన శాంసంగ్ S5

గత ఏడాది భారీ డిమాండ్

గత ఏడాది భారీ డిమాండ్

చైనా కు చెందిన ప్రముఖ సంస్థలు వివో, ఒప్పో ఫోన్లకు గత ఏడాది భారీ డిమాండ్ ఏర్పడటంతో చైనా మొబైల్ రంగం కు భారత్ లో ఇక తిరుగు లేదు అనుకున్న విషయం తెలిసిందే.

అది నీటి బుడగేనని

అది నీటి బుడగేనని

అయితే అది నీటి బుడగేనని, మా సత్తా ఏంటో చూడండని ఇండియన్లు మరోసారి ఈ ఫోన్లపై విరుచుకుపడ్డారు.ఇంకా చెప్పాలంటే భారతీయుల దెబ్బకు ఈ కంపెనీల అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి.

చైనా ఉత్పతులపై నెగిటివ్ ప్రచారం

చైనా ఉత్పతులపై నెగిటివ్ ప్రచారం

ఇప్పుడు వినియోగదారుల నుంచి చైనా ఉత్పతులపై నెగిటివ్ ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. చైనా సంస్థల బిజినెస్ తగ్గడానికి ఇది కూడా ఓ కారణంగా చెబుతున్నారు.

ఒప్పో స్మార్ట్ ఫోన్లు బ్లాస్ట్
 

ఒప్పో స్మార్ట్ ఫోన్లు బ్లాస్ట్

 అదీకాక ఆ మధ్యన ఒప్పో స్మార్ట్ ఫోన్లు బ్లాస్ట్ అయిన ఘటనలు జరిగాయి. అప్పటి నుంచే వీటిపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వెళ్ళింది.

ఏకంగా 30 శాతానికి తగ్గిపోవడంతో

ఏకంగా 30 శాతానికి తగ్గిపోవడంతో

వివో, ఒప్పో ఫోన్ల విక్రయాలు జులై నెలలో ఏకంగా 30 శాతానికి తగ్గిపోవడంతో కంగారు పడిన చైనా సంస్థలు తమ ప్రతినిధులను ఇండియాకు పంపినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

షియోమీ ఫోన్లు

షియోమీ ఫోన్లు

ఆ కంపెనీల సంగతి అలా ఉంటే తాజాగా చైనాకు చెందిన మరో సంస్థ షియోమీ ఫోన్లు గత నెల రోజుల వ్యవధిలో రెండు ఫోన్లు పేలిన ఘటనలు కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమ్మకాలపై తీవ్ర ప్రబావం చూపుతున్నాయి.

డోక్లాం వద్ద నెలకొన్న పరిస్థితుల కారణంగా

డోక్లాం వద్ద నెలకొన్న పరిస్థితుల కారణంగా

దీంతో పాటు డోక్లాం వద్ద నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. సైన్యాన్ని ఉపసంహరించుకోకుంటే యుద్ధానికి దిగుతామని చైనా హెచ్చరికలు చేస్తోంది.

చైనాకు బుద్ధి చెప్పాలంటే

చైనాకు బుద్ధి చెప్పాలంటే

ఈ నేపథ్యంలో చైనాకు బుద్ధి చెప్పాలంటే.. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే నినాదం మొదలైంది. ఈ ఎఫెక్ట్ చైనా మొబైల్ కంపెనీలపై స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.

ఇక్క‌డి మార్కెట్‌ను పూర్తిగా క‌బ్జా చేసేసిన చైనాకు

ఇక్క‌డి మార్కెట్‌ను పూర్తిగా క‌బ్జా చేసేసిన చైనాకు

ఈ విషయాలు ఇలా ఉంటే ఇండియాకు చీప్‌గా ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేస్తూ.. ఇక్క‌డి మార్కెట్‌ను పూర్తిగా క‌బ్జా చేసేసిన చైనాకు చెక్ పెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది.

ఉత్ప‌త్తుల విలువ 2200 కోట్ల డాల‌ర్లు

ఉత్ప‌త్తుల విలువ 2200 కోట్ల డాల‌ర్లు

భార‌త్‌లో చైనా ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ ఉత్ప‌త్తుల విలువ 2200 కోట్ల డాల‌ర్లుగా ఉంద‌ని సీఐఐ వెల్ల‌డించింది. ఇంత భారీ మొత్తం చూసి ప్ర‌భుత్వం కూడా కంగుతిన్న‌ది.

భార‌త ఆన్‌లైన్ మార్కెట్ల‌లో

భార‌త ఆన్‌లైన్ మార్కెట్ల‌లో

ఇదిలా ఉంటే భార‌త ఆన్‌లైన్ మార్కెట్ల‌లో చైనా కంపెనీలు ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో చాలావ‌ర‌కు డివైస్‌లు స‌మాచారాన్ని చైనా స‌ర్వ‌ర్ల‌లో నిక్షిప్తం చేస్తున్నాయి.

ఆన్‌లైన్ ట్రాన్స‌క్ష‌న్స్ చేసిన స‌మ‌యంలోనూ

ఆన్‌లైన్ ట్రాన్స‌క్ష‌న్స్ చేసిన స‌మ‌యంలోనూ

ఈ డివైస్‌ల నుంచి ఆన్‌లైన్ ట్రాన్స‌క్ష‌న్స్ చేసిన స‌మ‌యంలోనూ కీల‌క స‌మాచారం చైనా స‌ర్వ‌ర్ల‌కు చేరిపోతున్న‌ది. వీటివ‌ల్ల ఇక్క‌డి వ్య‌క్తులు, వ్యాపారాలు, ప్ర‌భుత్వ విభాగాల కీల‌క స‌మాచారం చైనాకు లీక్ అవుతున్న‌ద‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది.

Best Mobiles in India

English summary
cellphone retail chains: Sales of Oppo, Vivo drop 30% in July Read More At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X