ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి మరో దేశీయ మొబైల్ కంపెనీ సలోరా

Posted By: Staff

ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి మరో దేశీయ మొబైల్ కంపెనీ సలోరా

సలోరా ఇంటర్నేషనల్ ఇండియా ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న బ్రాండ్. ఇటీవలే సలోరా కంపెనీ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి ఎంట్రీ లెవల్ మొబైల్ ఫోన్ సలోరా ఎస్ఎమ్ 401ని విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంది. సలోరా ఎస్ఎమ్ 401 మొబైల్ చూడడానికి ట్రెండీ డిజైన్‌ని కలిగి ఉండి బార్ ఫోన్ కేటగిరిలోకి వెళుతుంది. ఇంకొక విషయం చెప్పాలంటే దేశీయ మొబైల్ కంపెనీ మైక్రో మ్యాక్స్ మొబైల్స్ మోడల్స్ ఏవిధంగా ఉందో అదేవిధంగా ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి మొబైల్‌ సలోరా ఎస్ఎమ్ 401.

ప్రస్తుతం నోకియా, శ్యామ్ సంగ్ వేరే మోడల్స్‌లలో ఉన్న ఎంట్రీ లెవెల్ మొబైల్స్ ఫోన్స్‌తో పోల్చితే గనుక సలోరా ఎస్ఎమ్ 401మొబైల్ వెనుక భాగాన ఉన్న కెమెరా 1.3 మెగా ఫిక్సల్‌ని కలిగి ఉండి చూడచక్కని అందమైన ఇమేజీలను, ఫోటోలను తీయడానికి ఉపయోగపడుతుంది. యూజర్స యొక్క అందమైన వీడియోలను తీసి వాటిని మొమొరీలో స్ట్రో చేసుకునేటటువంటి వెసులు బాటు కూడా ఉంది. సలోరా ఎస్ఎమ్ 401లో మరో ముఖ్యమైన స్పెషాలిటీ ఏమిటంటే వెబ్ కెమెరా ఫంక్షనాలిటీని కూడా అందిస్తుంది.

సలోరా ఎస్ఎమ్ 401 ఫోన్‌లో మల్టీ ఫార్మెట్ ఆడియో ప్లేయర్ MP3, WAV లాంటి అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఎఫ్‌ఎమ్ రేడియోతోపాటు, వెనుక భాగాన ఉన్నటువంటి స్పీకర్స్ మంచి క్లారిటీ ఇవ్వడంతో పాటు, హెడ్ సెడ్స్‌తో పాటు బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునే అవకాశం కూడా ఉంది. మొబైల్‌‍‌తో పాటు 3.5 mm యూనివర్సిల్ ఆడియో జాక్ లభిస్తుంది. మొబైల్‌లో ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడానికి పిఆర్‌ఎస్ ఫెసిలిటీ కూడా ఉంది. రాత్రిపూట బయటకు వెళ్లేందుకు గాను టార్చ్ లైట్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది.

Salora SM 401 features:

1.3 Mega Pixel camera
Java
Bluetooth
Up to 16 GB expandable Micro SD memory
MP3 and Video player
K series Amplifier
Torch light

ఇక సలోరా ఎస్ఎమ్ 401 ధర విషయానికి వస్తే కేవలం రూ 2499. కంపెనీ విడుదల చేయనున్నటువంటి ఈ కొత్త మోడల్ మార్కెట్లో గనుక క్లిక్ ఐతే మరికొన్ని మోడల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తామని అన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting