ఇలియానా పని అయిపోయింది అందుకే సమంత..

Posted By: Staff

ఇలియానా పని అయిపోయింది అందుకే సమంత..

'ఏ మాయ చేసావె' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టి, మొదటి సినిమాతోనే యువత మనసుని కొల్లగొట్టింది హీరోయిన్ సమంత. అలాంటి అందమైన హీరోయిన్ ఆంధ్రప్రదేశ్ ప్రముఖ మొబైల్స్ సంస్థ బిగ్ ‘సి’కి ప్రముఖ సినీ తార సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. రిటైల్ వ్యాపారంలో బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించుకున్న తొలి రిటైల్ సంస్థ బిగ్ ‘సి’యేనని సంస్థ సీఎండీ ఎమ్ బాలు తెలిపారు. అంతేకాకుండా సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారించడం వల్ల మా సంస్ద సేల్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

తొలిసారిగా 2006-08 వరకు హీరోయిన్ చార్మి, 2008-09 వరకు హీరోయిన్ కాజల్, 2010-11 వరకు హీరోయిన్ ఇలియానాలు తమకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించారని ఆయన తెలిపారు. మొబైల్ ఫోన్‌లకు సంబంధించిన ప్రతి రంగంలో తాము నెంబర్ వన్‌గా ఉన్నామని ఆయన చెప్పారు. ఈ సందర్బంలో హీరోయిన్ సమంత రాష్ట్రంలోని అగ్రస్థాయి మొబైల్ కంపెనీకి ప్రచార కర్తగా వ్యవహరించడం తనకు ఆనందంగా ఉందని సమంత అన్నారు. ఇక సమంత ప్రస్తుతం సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ సరసన దూకుడు సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకానుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting