రూ.10 వేల కంటే తక్కువ ధరలో 5G ఫోన్ కావాలా.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో శాంసంగ్ ఫోన్‌లు ఇవిగో..!
ప్రస్తుతం శాంసంగ్ నుంచి ఎంట్రీ లెవల్ మోడల్‌లో అనేక 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అనేక హ్యాండ్‌సెట్స్ విడుదల అయ్యాయి. ప్రస్తుతం రూ.10 వేల కంటే తక్కువ ధరలో ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ A06 5G, గెలాక్సీ M06 5G, గెలాక్సీ F06 5G వంటి ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్లు 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A06 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy A06 5G) ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 4GB ర్యామ్ + 64GB స్టోరేజీని రూ.7690 కే కొనుగోలు చేయవచ్చు. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9799 గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్, లైట్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A06 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 OS తో పనిచేస్తోంది. 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, LED ఫ్లాష్‌తోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్ (Samsung Galaxy M06 5G) 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 తో పనిచేస్తోంది. 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ అందుబాటులో లేదు. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999 గా ఉంది. ఈ ఫోన్ బ్లేజింగ్ బ్లాక్, సేజ్ గ్రీన్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్ (Samsung Galaxy F06 5G) 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 తో పనిచేస్తోంది. ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 4GB/64GB, 4GB/128GB, 6GB/128GB వేరియంట్స్‌లో లభిస్తుంది


Click it and Unblock the Notifications








