కొత్త పీచర్లతో సామ్‌సంగ్ Galaxy J2 వచ్చేసింది, రూ.9,750కే

సామ్‌సంగ్ తన గెలాక్సీ జే సిరీస్ Galaxy J2 స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.9,750. జూలై 14 నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. టర్బో స్పీడ్ టెక్నాలజీతో పాటు విప్లవాత్మక కలర్ ఎల్ఈడి నోటిఫికేషన్ సిస్టంను ఈ డివైస్‌తో సామ్‌సంగ్ అందిస్తోంది.

Read More : 7 అంగుళాల డిస్‌ప్లేతో సామ్‌సంగ్ Galaxy J Max

కొత్త పీచర్లతో సామ్‌సంగ్ Galaxy J2 వచ్చేసింది, రూ.9,750కే

Smart Glowగా పిలవబడుతోన్న ఈ ఎల్ఈడి నోటిఫికేషన్ సిస్టంను ఫోన్ రేర్ కెమెరా భాగంలో ఏర్పాటు చేసారు. కావల్సిన విధంగా ఈ ఎల్ఈడి నోటిఫికేషన్ సిస్టంను కస్టమైజ్ చేసుకోవచ్చు. సేఫ్ రైడింగ్ కోసం ఎస్ బైక్ మోడ్, ఇంటర్నెట్‌ను పొదుపుగా వాడుకునేందుకు అల్ట్రా డేటా సేవిండ్ మోడ్ వంటి విప్లవాత్మక ఫీచర్లను ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్‌బస్టర్ ఫోన్‌లో సామ్‌సంగ్ పొందుపరిచింది. ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని ఆసక్తికర వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

Read More : రిలయన్స్ LYF ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు, 4జీ నెట్‌వర్క్ ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy J2 (2016) స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫినిషన్ ఎస్‌అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆపరేటింగ్ సిస్టం,

Samsung Galaxy J2 (2016) స్పెసిఫికేషన్స్

1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

Samsung Galaxy J2 (2016) స్పెసిఫికేషన్స్

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా.

Samsung Galaxy J2 (2016) స్పెసిఫికేషన్స్

(కెమెరా ప్రత్యేకతలు : ఆటో, బ్యూటీ ఫేస్, కంటిన్యూస్ షాట్, హెచ్‌డీఆర్ (హై డైనమిక్ రేంజ్), పానోరమా, ప్రో, సెల్ఫీ, స్పోర్ట్స్, సౌండ్ అండ్ షాట్, రేర్ కెమెరా సెల్ఫీ).

Samsung Galaxy J2 (2016) స్పెసిఫికేషన్స్

4జీ కనెక్టువిటీ, 3జీ, వై-పై, బ్లుటూత్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J2 (2016) స్పెసిఫికేషన్స్

గెలాక్సీ జే2 ఫోన్ ఎస్ బైక్ మోడ్ ఫీచర్‌తో వస్తోంది. డివైస్‌లో ఈ మోడ్‌‌ను ఎనేబుల్ చేసి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే, మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా కాల్ చేసిన వారికి తర్వాత కాల్ చేయండి అనే మెసేజ్‌ను పంపుతుంది. దీంతో రైడర్స్ మాటిమాటికీ తమ మొబైల్ చూసుకోకుండా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించవచ్చు. అదే ఎమర్జెన్సీ అయితే కాల్ చేసిన వారు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి అంకెను ప్రెస్ చేసినట్లయితే అర్జెంట్ కాల్ అని డ్రైవింగ్ చేస్తున్న వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు బండిని పక్కాగా పార్క్ చేసి కాల్ రిసీవ్ చేసుకోవచ్చు.

Samsung Galaxy J2 (2016) స్పెసిఫికేషన్స్ :

గెలాక్సీ జే2 ఫోన్ ప్రత్యేకమైన అల్ట్రా సేవింగ్ మోడ్ ఆప్షన్‌తో వస్తోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా యూజర్లు 50 శాతం వరకు మొబైల్ డేటాను ఆదా చేసుకోవచ్చు. ఫీచర్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌‍లో రన్ అయ్యే అనవసరమైన యాప్స్‌ను అల్ట్రా సేవింగ్ మోడ్ ఆప్షన్‌ ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తూ డేటాను ఆదా చేస్తుంటుంది.

కలర్ వేరియంట్స్

బ్లాక్, గోల్డ్ ఇంకా సిల్వర్ వేరియంట్ లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. జూలై 14 నుంచి అన్ని ఆన్‌లైన్, రిటైల్ ఛానళ్ల ద్వారా ఫోన్ అందుబాటులోకి వస్తుంది.

రూ.4,500 విలువ చేసే డబల్ డేటా ప్యాక్ ఉచితంగా

ఈ ఫోన్ కొనుగోలు పై ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.4,500 విలువ చేసే 6 నెలల డబల్ డేటా ప్యాక్‌ను ఉచితంగా పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Announces Galaxy J2 (2016) Smartphone: All You Need to Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot