అభిమానులకు ఆగస్టు 15 గిఫ్ట్, శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు
దేశీయ మార్కెట్ రోజురోజుకు వేడెక్కిపోతున్న నేపధ్యంలో దిగ్గజ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లను ప్రకటించాయి.
దేశీయ మార్కెట్ రోజురోజుకు వేడెక్కిపోతున్న నేపధ్యంలో దిగ్గజ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లను ప్రకటించాయి. మరికొన్ని రోజుల్లో ఆగస్టు 15 సంబరాలకి దేశం సిద్ధమవుతున్న నేపధ్యంలో శాంసంగ్, ఆపిల్, షియోమి లాంటి కంపెనీలు వినియోగదారులకు కొత్త ఆఫర్లను ప్రకటించే పనిలో పడ్డాయి. అన్నింటికంటే ముందుగా శాంసంగ్ ఇండియాలోని అభిమానుల కోసం స్మార్ట్‌ఫోన్లపై బంపరాఫర్లను ప్రకటించింది. ఆ వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

గెలాక్సీ ఎస్9 ప్లస్
గెలాక్సీ ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ షాపులో 4 వేల రూపాయల తగ్గింపులో రూ.64,990కు అందుబాటులో ఉంది. అదనంగా గెలాక్సీ ఎస్9ప్లస్ కస్టమర్లకు రూ.3000 ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.6000 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.

అదనంగా రూ.6000 ఎక్స్చేంజ్ వాల్యు
ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ కంపెనీలు కూడా ఆఫర్లను అందిస్తున్నాయి. ఎంపిక చేసిన మొబైల్స్‌పై అదనంగా రూ.6000 ఎక్స్చేంజ్ వాల్యు అందుబాటులో ఉంది.

గెలాక్సీ ఎస్9
గెలాక్సీ ఎస్9 స్మార్ట్‌ఫోన్ ధర రూ.57,900 నుంచి ప్రారంభమవుతుంది. ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్ 128జీబీ, 256జీబీ వేరియంట్‌పై రూ.6000 ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్, 64జీబీ మోడల్‌పై రూ.5000 క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది.

రూ.6000 క్యాష్‌బ్యాక్
అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుదారులకు రూ.6000 క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది.

గెలాక్సీ సీరిస్
గెలాక్సీ ఆన్ మ్యాక్స్, గెలాక్సీ ఆన్7 ప్రైమ్(64జీబీ వేరియంట్), గెలాక్సీ ఆన్ నెక్ట్స్(64జీబీ వేరియంట్), గెలాక్సీ ఆన్7 ప్రొ, గెలాక్సీ జే3 ప్రొ, గెలాక్సీ ఆన్5 ప్రొ, గెలాక్సీ ఆన్5లు ఆఫర్లలో అందుబాటులో ఉన్నాయి.

యాక్ససరీస్‌పై..
టీవీలు, అప్లియెన్స్, వేరబుల్స్, ఆడియో యాక్ససరీస్‌పై కూడా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఇతర ఆఫర్లను కంపెనీ ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది.

పేటీఎం 5 శాతం క్యాష్‌బ్యాక్
ఆగస్టు 1 నుంచి మొదలైన ఈ సేల్ ఆగస్టు 5 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్, పేటీఎం నుంచి ప్రొడక్ట్‌లు కొనుగోలు చేసే కస్టమర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.


Click it and Unblock the Notifications