డ్యూయెల్ డిస్‌ప్లేతో శాంసంగ్ నుంచి హైఎండ్ ఫ్లిప్‌ఫోన్, ధర చూస్తే బేజారే !

|

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ డబ్ల్యూ 2019 ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. డబ్ల్యూ 2019' పేరుతో హైఎండ్‌ ఫ్లిప్‌మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో 4.2 ఇంచుల సైజ్ ఉన్న రెండు డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్‌ సూపర్‌ డిస్‌ప్లే, డ్యుయల్‌ రియర్‌ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్‌ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇది ఫ్లిప్ ఫోన్

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవడం ఎలా, గూగుల్ చెప్పిన ట్రిక్స్

పుల్‌ బాడీ 3డీ గ్లాస్ మెటల్ డిజైన్‌తో...
 

పుల్‌ బాడీ 3డీ గ్లాస్ మెటల్ డిజైన్‌తో...

పుల్‌ బాడీ 3డీ గ్లాస్ మెటల్ డిజైన్‌తో రూపొందించిన ఈ డివైస్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసింది. రోజ్‌ గోల్డ్, ప్లాటినం కలర్ వేరియెంట్లలో లభ్యమవుతున్న శాంసంగ్ డబ్ల్యూ 2019 స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.1,97060 గా ఉంది.

స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్....

స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్....

స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్‌లను అమర్చారు. అందువల్ల ఈ ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్ పూర్తిగా 3డీ గ్లాస్ మెటల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఫోన్‌కు పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌...

ఫోన్‌కు పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌...

ఈ ఫోన్‌కు పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 3070 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. శాంసంగ్ డబ్ల్యూ 2019 స్మార్ట్‌ఫోన్ గోల్డ్, ప్లాటినం కలర్ వేరియెంట్లలో విడుదల కాగా ఈ ఫోన్ ధర రూ.1,98,720 గా ఉంది.

శాంసంగ్ డబ్ల్యూ2019 ఫీచర్లు...
 

శాంసంగ్ డబ్ల్యూ2019 ఫీచర్లు...

4.2 ఇంచ్ సూపర్ అమోలెడ్ డ్యుయల్ (ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌) డిస్‌ప్లేలు, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3070 ఎంఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung announces W2019 flip phone with dual displays and side-mounted fingerprint reader in China more News at gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X