ఇండియన్ ఈ-కామర్స్ ట్రెండ్: సామ్‌సంగ్ టాప్ రెండో స్థానంలో యాపిల్ (విశ్లేషణ)

|

మొబైల్ ఇంకా ట్యాబ్లెట్ ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ సంతరించుకున్న నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు భారత్‌లో జోరందుకున్నాయి. ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. గూగుల్ ఇండియా స్టడీ ప్రకారం గాడ్జెట్‌లను విక్రయించే ఈ-కామర్స్ సైట్‌ల వ్యాపారం మూడు పవ్వులు, ఆరు కాయలుగా విస్తరిస్తోంది. ప్రముఖ డిజిటల్ మీడీయా టెక్నాలజీ సంస్థఐనుక్సు (Inuxu) ‘ ద ఇండియన్ ఈ-కన్స్యూమర్ మొబైల్/ట్యాబ్లెట్ ల్యాండ్‌స్కేప్' పేరుతో ఓ ఆసక్తికర నివేదికను విడుదల చేసింది. ఇండియన్ ఈ-కామర్స్ విభాగంలో టాప్ మొబైల్ ఇంకా ట్యాబ్లెట్ పీసీల బ్రాండ్‌ల పోకడల, విజేతలు, పోటీదారులు ఇంకా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న కంపెనీల గురించిన వివరాలను ఈ నివేదికలో విశ్లేషించటం జరిగింది.

 

మొబైల్స్ విభాగానికి వస్తే:

ఆన్‌లైన్‌లో అత్యధికంగా శోధించబడిన బ్రాండ్‌గా సామ్‌సంగ్ అగ్రస్థానంలో ఉంది. యాపిల్ రెండవ స్థానంలో నిలవగా. అత్యధికంగా ఆసక్తిని సొంతం చేసుకున్న మొబైల్ మోడల్స్ విభాగంలో నోకియా లూమియా 920 పై నెటిజనులు ప్రత్యేకమైన ఆసక్తిని కనబరిచారు. మొత్తం ఐదు స్థానాలకు గాను మూడు స్థానాలను యాపిల్ మోడల్స్ వసం చేసుకున్నాయి. కొత్త మోడళ్ల విడుదల అంశంలో నోకియా, సోనీ, హెచ్‌టీసీ బ్రాండ్‌లు నెం.1 స్థానంలో ఉన్న సామ్‌సంగ్‌కు పోటీగా నిలవనున్నాయి.

ట్యాబ్లెట్స్ విభాగానికి వస్తే:

ట్యాబ్లెట్ పీసీల విభాగానికి వస్తే ఆన్‌లైన్ మార్కెట్లో యాపిల్ ఇంకా సామ్‌సంగ్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. 34.79శాతం విక్రయాలతో యాపిల్ ముందంజలో ఉంటే 32.29శాతం స్వల్ప మార్జిన్‌తో సామ్‌సంగ్ రెండో స్థానంలో ఉంది. అత్యధికంగా ఆసక్తిని సొంతం చేసుకున్న ట్యాబ్లెట్ మోడల్స్ విభాగంలో ఐదు స్థానాలకు గాను నాలుగు స్థానాలను సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ సిరీస్ కైవసం చేసుకుంది. వచ్చే నెలల్లోనూ యాపిల్ తన హావాను కొనసాగించనుంది. ట్యాబ్లెట్ పీసీల విభాగంలో మైక్రోమ్యాక్స్ పంజుకుంది. హెచ్‌సీఎల్, జింక్, లెనోవో వంటి బ్రాండ్‌లు రానున్న కాలంలో ఒడిదుడుకులను ఎదుర్కొనున్నాయి.

ఈ విశ్లేషనాత్మక డేటాను మే 2013 - జూలై 2013 మధ్య ఇండియాలోని ప్రముఖ ధర పోలిక వెబ్ సైట్ www.goprobo.com నుంచి సేకరించటం జరిగింది.

అత్యధికంగా శోధించబడిన మొబైల్ బ్రాండ్‌ల వివరాలు

అత్యధికంగా శోధించబడిన మొబైల్ బ్రాండ్‌ల వివరాలు

అత్యధికంగా శోధించబడిన మొబైల్ బ్రాండ్‌ల వివరాలు

అత్యధికంగా ఆసక్తిని సొంతం చేసుకున్న మొబైల్ మోడల్స్

అత్యధికంగా ఆసక్తిని సొంతం చేసుకున్న మొబైల్ మోడల్స్

అత్యధికంగా ఆసక్తిని సొంతం చేసుకున్న మొబైల్ మోడల్స్ విభాగంలో నోకియా లూమియా 920 పై నెటిజనులు ప్రత్యేకమైన ఆసక్తిని కనబరిచారు. మొత్తం ఐదు స్థానాలకు గాను మూడు స్థానాలను యాపిల్ మోడల్స్ వసం చేసుకున్నాయి.

 

నోకియా, సోనీ, హెచ్‌టీసీ

నోకియా, సోనీ, హెచ్‌టీసీ

కొత్త మోడళ్ల విడుదల అంశంలో నోకియా, సోనీ, హెచ్‌టీసీ బ్రాండ్‌లు నెం.1 స్థానంలో ఉన్న సామ్‌సంగ్‌కు పోటీగా నిలవనున్నాయి.

 

అత్యధికంగా శోధించబడిన ట్యాబ్లెట్ పీసీలు
 

అత్యధికంగా శోధించబడిన ట్యాబ్లెట్ పీసీలు

ట్యాబ్లెట్ పీసీల విభాగానికి వస్తే ఆన్‌లైన్ మార్కెట్లో యాపిల్ ఇంకా సామ్‌సంగ్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. 34.79శాతం విక్రయాలతో యాపిల్ ముందంజలో ఉంటే 32.29శాతం స్వల్ప  మార్జిన్‌తో సామ్‌సంగ్ రెండో స్థానంలో ఉంది.

అత్యధికంగా ఆసక్తిని సొంతం చేసుకున్న ట్యాబ్లెట్ మోడల్స్

అత్యధికంగా ఆసక్తిని సొంతం చేసుకున్న ట్యాబ్లెట్ మోడల్స్

అత్యధికంగా ఆసక్తిని సొంతం చేసుకున్న ట్యాబ్లెట్ మోడల్స్ విభాగంలో ఐదు స్థానాలకు గాను నాలుగు స్థానాలను సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ సిరీస్ కైవసం

చేసుకుంది.

 

ట్యాబ్లెట్ పీసీల విభాగంలో మైక్రోమ్యాక్స్ పంజుకుంది

ట్యాబ్లెట్ పీసీల విభాగంలో మైక్రోమ్యాక్స్ పంజుకుంది

ట్యాబ్లెట్ పీసీల విభాగంలో మైక్రోమ్యాక్స్ పంజుకుని గ్లోబల్ బ్రాండ్ లకు పోటీనిస్తోంది.

హెచ్‌సీఎల్, జింక్, లెనోవో బ్రాండ్‌లకు కష్టాలు!

హెచ్‌సీఎల్, జింక్, లెనోవో బ్రాండ్‌లకు కష్టాలు!

హెచ్‌సీఎల్, జింక్, లెనోవో వంటి బ్రాండ్‌లు రానున్న కాలంలో ఒడిదుడుకులను ఎదుర్కొనున్నాయి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X